WhatsApp data breach : వాట్సాప్ డేటా బ్రీచ్.. 50కోట్ల మంది యూజర్ల వివరాలు లీక్!
WhatsApp data breach : వాట్సాప్‌లో వినియోగదారుల డేటా లీక్ అయినట్టు తెలుస్తోంది. యూజర్ల వాట్సాప్ నెంబర్లు.. ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నట్టు సమాచారం.
WhatsApp data breach : వాట్సాప్ డేటా బ్రీచ్ మరోమారు కలకలం సృష్టించింది. వాట్సాప్‌ను వాడుతున్న 500మిలియన్(50కోట్లు) మంది ఫోన్ నెంబర్లు లీక్ అయినట్టు తెలుస్తోంది. వాటిని ఆన్లైన్లో సేల్కు పెట్టినట్టు సమాచారం. ఇదే నిజమైతే.. వాట్సాప్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్‌గా ఈ ఘటన నిలిచిపోతుంది.
సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం.. హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరంలో ఓ యాడ్‌ను చూసినట్టు ఓ వ్యక్తి చెప్పాడు. 2022 డేటాబేస్ నుంచి 487మిలియన్ మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లను అమ్మకానికి పెట్టినట్టు పేర్కొన్నాడు. ఇండియా, సౌదీ అరేబియా, ఇటలీ, ఈజిప్ట్, యూకే, యూఎస్‌తో పాటు 84 దేశాలకు చెందిన వాట్సాప్ యూజర్ల ఫోన్ నెంబర్లు ఉన్నట్టు తెలిపాడు.
ఈ డేటాతో సైబర్ నేరగాళ్లు ఫిషింగ్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అందువల్ల.. తెలియని ఫోన్ నెంబర్ల నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తే అటెండ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
సేల్కు వాట్సాప్ డేటాసెట్..!
WhatApp phone number on sale : ఈ డేటా బ్రీచ్‌లో అమెరికాకు చెందిన 32 మిలియన్ మంది రికార్డులు ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్ నుంచి 45మిలియన్, ఇటలీ నుంచి 35మిలియన్, సౌదీ నుంచి 29మిలియన్, ఫ్రాన్స్‌నుంచి 20మిలియన్, టర్కీ నుంచి 20మిలియన్ మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యా నుంచి 10మిలియన్ మంది, యూకే నుంచి 11మిలియన్ మంది వాట్సాప్ డేటా లీక్ అయినట్టు స్పష్టం చేసింది.
యూఎస్ డేటా సెట్‌ను 7000డాలర్లు(సుమారు రూ. 5,71,690)కి, యూకే డేటా సెట్‌ను 2,500డాలర్లు(రూ. 2,04,175)కి, జర్మనీ డేటా సెట్‌ను 2000డాలర్లు(రూ. 1,63,340)కి అమ్ముతున్నట్టు నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ నెంబర్లన్నీ.. మెటా ఆధారిత వాట్సాప్‌లో యాక్టివ్గానే ఉన్నట్టు వివరించింది.
WhatsApp data on sale : మెటాలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. కాగా.. వీటిల్లో డేటా లీక్ అనేది కొత్త విషయమేమీ కాదు. గతేడాది.. ఓ వ్యక్తి.. ఫేస్‌బుక్‌కు చెందిన 500మిలియన్ మంది డేటాను ఆన్లైన్లో ఫ్రీగా ఆఫర్ చేశాడు. ఈ డేటాలో వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి.
సంబంధిత కథనం