Vivo T3 Ultra Discount : 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, కర్వ్‌డ్ డిస్ ప్లేతో వివో ఫోన్.. ఫస్ట్ సేల్‌లో మూడు వేల డిస్కౌంట్
Vivo T3 Ultra Bookings : కొత్త వివో ఫోన్‌పై కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. కర్వ్‌డ్ డిస్ ప్లేతో వచ్చిన వివో కొత్త స్మార్ట్ ఫోన్ వివో టీ3 అల్ట్రా సేల్‌కు రానుంది. ఈ ఫోన్ డిస్కౌంట్ వివరాల గురించి తెలుసుకుందాం..
చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో కర్వ్‌డ్ డిస్ ప్లేతో కొత్త మిడ్ రేంజ్ ఫోన్ వివో టీ3 అల్ట్రాను ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్‌లో ఫాస్టెస్ట్ కర్వ్ డ్ డిస్ ప్లే ఫోన్‌గా తీసుకొచ్చింది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 19 సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. విశేషమేమిటంటే మొదటి సేల్‌లో వివో టీ3 అల్ట్రాపై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
కొత్త వివో డివైజ్‌ను కంపెనీ వెబ్‌సైట్‌తోపాటుగా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్ వస్తుంది. దీంతో పాటు పెద్ద కర్వ్‌డ్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా అందిస్తుంది. మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ కు 1600కే+ అన్ టుటూ బెంచ్ మార్క్ స్కోర్ ఉంది.
వివో టీ3 అల్ట్రా 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.31,999. అలాగే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గా నిర్ణయించారు. మొదటి సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుల సాయంతో చెల్లిస్తే రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
బ్యాంక్ ఆఫర్‌కు ప్రత్యామ్నాయంగా రూ.3000 ఫ్లాట్ ఎక్స్ఛేంజ్ బోనస్ పొందొచ్చు. వివో ఫోన్ లూనార్ గ్రే, ఫ్రాస్ట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ ఫోన్లో 6.78 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 4500 అంగుళాల పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ 14 సాఫ్ట్ వేర్ స్కిన్‌ను పొందుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఓఐఎస్ సపోర్ట్‌తో ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం వివో టీ3 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ పరికరం ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. అదే సమయంలో సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ కోసం, 80 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని పొందుతుంది. ఫోన్‌లో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.