Best phones under <span class='webrupee'>₹</span>20,000: అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో రూ .20,000 లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
హై రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, అడ్వాన్స్ డ్ కెమెరా సిస్టమ్ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రూ.20,000 లోపు ధరలో లభించే బెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ల లిస్ట్ ను మీ కోసం సిద్ధం చేశాం. ఈ పండుగ సీజన్ లో వీటితో మీ స్మార్ట్ ఫోన్ ను అప్ గ్రేడ్ చేసుకోండి.
కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా?.. అది కూడా రూ. 20 వేల లోపు ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్స్, లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ తో కావాలా? మీ అవసరాలకు సరిపోయే స్మార్ట్ ఫోన్ ను ఎంచుకోవడంలో మీకు సహకరించడం కోసం ఒక జాబితాను సిద్ధం చేశాం. షియోమీ, మోటరోలా, నథింగ్ వంటి బ్రాండ్ల నుంచి అద్భుతమైన కొత్త మోడళ్లు వచ్చాయి. రూ.20,000 లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆకట్టుకునే ఫీచర్లు, హై క్వాలిటీతో నిండి ఉన్నాయి.
రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
ఐక్యూ జెడ్9
మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఐక్యూ జెడ్9 (iQOO Z9) పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వైబ్రెంట్ కలర్స్, ఫ్లూయిడ్ విజువల్స్ ఉన్నాయి. రియర్ కెమెరా సెటప్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో యాప్స్, మీడియాకు పుష్కలమైన స్పేస్ అందిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 5జీ సిమ్ కార్డులను సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ లో దీని ధర రూ.19,998గా ఉంది. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.
పోకో ఎక్స్6 5జీ
పోకో ఎక్స్6 5జీ (Poco X6 5G) లో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ను అందించారు. రియర్ కెమెరా సిస్టమ్ లో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, హై క్వాలిటీ సెల్ఫీల కోసం ముందు కెమెరా 16 మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి. ఇందులో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. డ్యూయల్ 5జీ సిమ్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ వీ13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను అమెజాన్ లో రూ.18,499 గా నిర్ణయించారు. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.
సీఎంఎఫ్ ఫోన్ (1)
సీఎంఎఫ్ ఫోన్ (1) (CMF Phone (1)) మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. రియర్ కెమెరా సెటప్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా క్రిస్ప్ సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ షూటర్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డ్యూయల్ 5జీ సిమ్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ వీ14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.17,840గా ఉంది. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.
షియోమీ రెడ్ మీ నోట్ 13
మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై షియోమీ రెడ్ మీ నోట్ 13 (Xiaomi Redmi Note 13) పనిచేయనుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డ్యూయల్ 5జీ సిమ్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వీ13 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,987గా ఉంది. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.
మోటో జీ85
స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై మోటో జీ 85 (Moto G85) పనిచేయనుంది. ఇందులో వైబ్రెంట్, ఫ్లూయిడ్ విజువల్స్ తో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. రియర్ కెమెరా సిస్టమ్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది. ఫ్రంట్ కెమెరాలో హై-రిజల్యూషన్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. డ్యూయల్ 5జీ సిమ్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మోటో జీ85 ఆండ్రాయిడ్ (android)వీ14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ (amazon) లో రూ.19,299 గా ఉంది. క్యాష్ బ్యాక్స్, బ్యాంక్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.