10 multibagger penny stocks: 2023 లో ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచెత్తిన 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్-vi to suzlon these 10 multibagger penny stocks give up to 250 percent return in 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  10 Multibagger Penny Stocks: 2023 లో ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచెత్తిన 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్

10 multibagger penny stocks: 2023 లో ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచెత్తిన 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్

HT Telugu Desk HT Telugu
Dec 30, 2023 07:35 PM IST

10 multibagger penny stocks: 2023వ సంవత్సరం ఇన్వెస్టర్లకు మరచిపోలేని లాభాలను ఇచ్చింది. ముఖ్యంగా కొన్ని పెన్నీ స్టాక్స్ ఊహించని లాభాలను తెచ్చిపెట్టాయి. ఇన్వెస్టర్లు భారీగా లాభాలు తెచ్చిన 10 మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: iStock)

10 multibagger penny stocks: పెన్నీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ తో కూడుకున్నది. సరైన అధ్యయనం, ప్రణాళికలతో పెట్టుబడి పెడితే, పెన్నీ స్టాక్స్ తో లక్షల్లో లాభాలను పొందవచ్చు. కానీ, కేవలం లాభాపేక్షతో ఎలాంటి అధ్యయనం, ప్రణాళిక లేకుండా పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం సముచితం కాదు. వొడాఫోన్ ఐడియా, సుజ్లాన్, రిలయన్స్ పవర్ తదితర 10 మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ 2023 లో పెట్టుబడి దారులకు 250% వరకు రాబడిని ఇచ్చాయి.

2023 లో అధిక లాభాలు తెచ్చిన పెన్నీ స్టాక్స్

2023 లో భారీ మల్టీబ్యాగర్ (10 multibagger penny stocks) రాబడిని అందించిన కొన్ని ప్రసిద్ధ పెన్నీ స్టాక్స్ ఇవే..

వొడాఫొన్ ఐడియా

ఈ పెన్నీ స్టాక్ షేరు ధర సుమారు రూ .8 నుంచి రూ .16 వరకు పెరిగింది. ఇది 2023 లో దాని పొజిషనల్ ఇన్వెస్టర్లకు 100 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ వ్యాల్యూ 2023 మార్చి చివరి నాటికి రూ .5.80 స్థాయికి పడిపోయింది. ఆ తరువాత క్రమంగా పుంజుకుని రూ. 16 వరకు వచ్చింది.

రిలయన్స్ పవర్

అనిల్ అంబానీకి చెందిన ఈ కంపెనీ షేర్లు 2023 ప్రారంభంలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని చవి చూశాయి. 2023 మార్చి చివరి నాటికి ఎన్ఎస్ఈలో ఈ స్టాక్ ధర రూ.9.15 గా ఉంది. ఈ సంవత్సరం చివరకు వచ్చేనాటికి దీని ధర రూ.23.30 వరకు చేరుకుంది. అంటే, దాదాపు 150 శాతానికి పైగా రాబడిని అందించింది.

మౌరియా ఉద్యోగ్

2023 చివరి ట్రేడింగ్ సెషన్లో ఈ పెన్నీ షేరు రూ.10.23 వద్ద ముగిసింది. ఈ పెన్నీ షేరు ధర ఈ సంవత్సరం ప్రారంభంలో రూ.3.67 గా ఉంది. ఆ స్థాయి నుంచి 2023 చివరి నాటికి రూ.10.23 స్థాయికి పెరిగింది. అంటే, 2023లో ఈ పెన్నీ స్టాక్ 180 శాతం రాబడిని ఇచ్చింది.

కంఫర్ట్ ఇన్ టెక్

ఈ స్మాల్ క్యాప్ షేరు ధర 2023 లో రూ.2.69 నుంచి రూ.9.38 స్థాయికి పెరిగింది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ గత ఆరు నెలల్లో 100 శాతానికి పైగా రాబడిని ఇవ్వగా, గత నెల రోజుల్లోనే ఇది 20 శాతానికి పైగా పెరిగింది. దీని మార్కెట్ క్యాప్ రూ.300 కోట్లుగా ఉంది.

వివాంటా ఇండస్ట్రీస్

ఈ స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.1.63 నుంచి రూ.4.52 స్థాయికి పెరిగాయి. 2023 లో భారత స్టాక్ మార్కెట్ డెలివరీ చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.6.93గా ఉంది.

బీఎస్ఈఎల్ ఆల్గో

ఈ పెన్నీ షేరు ధర 2023 లో రూ.4.76 నుంచి రూ.16.20 కి పెరిగింది. అంటే, సంవత్సర కాలంలో ఈ షేరు ధరలో 240 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 17.67 కాగా, 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 4.34గా ఉంది.

కెన్వి జ్యువెల్స్

ఈ జువెలరీ స్టాక్ ధర బిఎస్ఇలో 2023 ప్రారంభంలో రూ. 4.06 గా ఉంది. 2023 చివరి నాటికి రూ .8.30 కు పెరిగింది. అంటే దాదాపు 105 శాతం పెరిగింది. ఈ పెన్నీ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.15.70 కాగా, 52 వారాల కనిష్ఠం రూ.3.80గా ఉంది.

తరిణి ఇంటర్నేషనల్

2023 లో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ షేరు ధర రూ.4.95 నుంచి రూ.11.41కి పెరిగింది. ఈ పెన్నీ స్టాక్ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు 130 శాతం రాబడిని అందించింది. ఈ స్టాక్ శుక్రవారం రూ.15 కోట్ల మార్కెట్ క్యాప్ తో ముగిసింది. ఈ మల్టీ బ్యాగర్ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.18.28 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.4.11గా ఉంది.

సుజ్లాన్ ఎనర్జీ

ఈ ఎనర్జీ షేరు ధర 2023 సంవత్సరంలో రూ. 10.75 నుండి రూ .38.20 స్థాయికి పెరిగింది. అంటే, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ విలువ 2023 సంవత్సరంలో 250 శాతానికి పైగా పెరిగింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.44.00 కాగా, 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.6.95గా నమోదైంది.

తాటియా గ్లోబల్ వెంచర్

ఈ పెన్నీ స్టాక్ షేరు ధర రూ .1.42 నుంచి రూ .3.07 స్థాయికి పెరిగింది. ఇది 2023 లో వాటాదారులకు 150 శాతానికి పైగా రాబడిని అందించింది. కాబట్టి, ఈ స్టాక్ భారతీయ స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటిగా నిలిచింది. శుక్రవారం ఇది రూ.46.55 కోట్ల మార్కెట్ క్యాప్ తో ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.3.33 కాగా, 52 వారాల కనిష్ఠం రూ.0.86 గా ఉంది.

సూచన: పైన చేసిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Whats_app_banner