తెలుగు న్యూస్ / ఫోటో /
2024 stock picks: ఈ స్టాక్స్ తో 2024లో కనీసం 33 శాతం లాభాలు గ్యారెంటీ..
2024 stock picks: 2024 లో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ను బ్రోకరేజ్ సంస్థ ‘యాక్సిస్ సెక్యూరిటీస్’ సిఫారసు చేసింది. ఈ స్టాక్స్ వచ్చే సంవత్సరం కనీసం 33% వృద్ధి చెందుతాయని యాక్సిస్ సెక్యూరిటీస్ చెబుతోంది.
(1 / 8)
Pitti Engineering: పిట్టి ఇంజనీరింగ్ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. దీని టార్గెట్ ధర రూ. 915, అంటే, ఇది 33% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. కంపెనీ బలమైన ఆర్డర్ బుక్, కాపెక్స్ ల ఆధారంగా యాక్సిస్ ఈ అంచనాకు వచ్చింది.
(2 / 8)
Cyient: సైయెంట్: ఈ మిడ్-క్యాప్ IT స్టాక్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది, దీని టార్గెట్ ధర రూ. 3,000, ఇది 28% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ER&D సేవల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా ఆశాజనకంగా ఉంది.
(3 / 8)
Archean Chemical Industries: ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ స్టాక్ టార్గెట్ ధర రూ. 810, ఇది 25% పెరుగుదలను సూచిస్తుంది. ఓవరాల్ గా ఇండస్ట్రీ వృద్ధితో పాటు బలమైన ఆర్డర్ బుక్, విశ్వసనీయమైన కస్టమర్ బేస్ కారణంగా ఈ స్టాక్ బుల్లిష్ ట్రెండ్ తో కొనసాగే అవకాశముంది. .(Bloomberg )
(4 / 8)
Amber Enterprises: అంబర్ ఎంటర్‌ప్రైజెస్ కు యాక్సిస్ బ్రోకరేజ్ ఇస్తున్న టార్గెట్ ధర రూ. 3,700. ఇది ప్రస్తుత ధరతో పోలిస్తే, 22% పెరుగుదలను సూచిస్తుంది. ఈ సంస్థకు రైల్వే సబ్-సిస్టమ్స్ & మొబిలిటీ విభాగంలో బలమైన ఆర్డర్ బుక్ సపోర్ట్ ఉంది,
(5 / 8)
Westlife Foodworld: వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ కు యాక్సిస్ బ్రోకరేజ్ ఇస్తున్న టార్గెట్ ధర రూ. 1,000, ఇది 22% పెరుగుదలను సూచిస్తుంది. సంస్థ చైన్ స్టోర్స్ విస్తృతితో పాటు కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తున్న కారణంగా బలమైన వృద్ధికి అవకాశాలున్నాయి. (Hemant Mishra/Mint)
(6 / 8)
State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2024 లో యాక్సిస్ సెక్యూరిటీస్ ఇస్తున్న టార్గెట్ ధర రూ. 800. ఇది 25% పెరుగుదలను సూచిస్తుంది. భారతదేశంలో ఇది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఆరోగ్యకరమైన PCR, బలమైన క్యాపిటలైజేషన్, విస్తృతమైన నెట్ వర్క్, కస్టమర్ల విశ్వసనీయత ఈ బ్యాంక్ బలాలు. (REUTERS)
(7 / 8)
Sansera Engineering: సన్సెరా ఇంజినీరింగ్ టార్గెట్ ధర రూ. 1,210. ఇది ప్రస్తుత ధరతో పోలిస్తే, 22% పెరుగుదలను సూచిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్, ఆరోగ్యకరమైన ఉత్పత్తి వైవిధ్యం, ఏరోస్పేస్ వ్యాపారంలో కొత్త ప్లేయర్‌లకు అవకాశాలు లేకపోవడం ఈ సంస్థ బలాలు.
(8 / 8)
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్ టార్గెట్ ధర రూ. 205. ఇది 19% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ఆకర్షణీయమైన వాల్యుయేషన్, గోల్డ్ లోన్ మార్కెట్ వృద్ధి, ఆరోగ్యకరమైన RoA/RoE ప్రొఫైల్ వంటివి ఈ స్టాక్‌కు కీలక సానుకూలాంశాలుగా ఉన్నాయి.(Non-banking finance company (NBFC) Manappuram Finance lends against gold. )
ఇతర గ్యాలరీలు