TVS Jupiter 125 SmartXonnect : ‘స్మార్ట్​’గా టీవీఎస్​ జూపిటర్​ 125.. కొత్త ఫీచర్స్​ ఇవే!-tvs jupiter 125 with smartxonnect bluetooth connectivity launched ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tvs Jupiter 125 Smartxonnect : ‘స్మార్ట్​’గా టీవీఎస్​ జూపిటర్​ 125.. కొత్త ఫీచర్స్​ ఇవే!

TVS Jupiter 125 SmartXonnect : ‘స్మార్ట్​’గా టీవీఎస్​ జూపిటర్​ 125.. కొత్త ఫీచర్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Oct 17, 2023 01:34 PM IST

TVS Jupiter 125 SmartXonnect : టీవీఎస్​ జూపిటర్​ 125 స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్​ లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

‘స్మార్ట్​’గా టీవీఎస్​ జూపిటర్​ 125..
‘స్మార్ట్​’గా టీవీఎస్​ జూపిటర్​ 125..

TVS Jupiter 125 SmartXonnect : టీవీఎస్​ మోటార్​కు చెందిన​ జూపిటర్​ 125 స్కూటర్​ ఇప్పుడు మరింత స్మార్ట్​ అయ్యింది! ఈ మేరకు.. జూపిటర్​ 125 స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్​ మోడల్​ను తాజాగా లాంచ్​ చేసింది సంస్థ. ఈ మోడల్​ విశేషాలు, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కొత్తగా.. టీవీఎస్​ జూపిటర్​ 125..

కొత్త టీవీఎస్​ జూపిటర్​ 125లో బ్లూటూత్​ కనెక్టివిటీ ఉంటుంది. ఈ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్​ యాప్​.. ఐఓఎస్​తో పాటు ఆండ్రాయిడ్​లో కూడా అందుబాటులో ఉంది. టర్న్​ బై టర్న్​ నేవిగేషన్​, వాయిస్​ అసిస్టెన్స్​, కాల్​- మెసేజ్​ నోటిఫికేషన్స్​ వంటివి ఈ యాప్​​లో ఉంటాయి. అంతేకాకుండా.. అనేక సోషల్​ మీడియా, షాపింగ్​- డెలివరీ యాప్స్​ అలర్ట్స్​ కూడా పొందొచ్చు. రియల్​- టైమ్​ స్పోర్ట్స్​ స్కోర్స్​, వెథర్​ అప్డేట్స్​, న్యూస్​ అప్డేట్స్​ కూడా పొందొచ్చు.

ఇక కొత్త స్కూటర్​లో 'ఫాలో-మీ' హెడ్​ల్యాంప్​ ఫీచర్​ను యాడ్​ చేసింది సంస్థ. ఫలితంగా.. ఇంజిన్​ ఆగిపోయిన 20 సెకన్ల పాటు హెడ్​ల్యాంప్​ ఆన్​లోనే ఉంటుంది. పిలియన్​ రైడర్స్​ కోసం కొత్త బ్యాక్​రెస్ట్​ని కూడా ఇచ్చింది. ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో అనేక డేటా పొందొచ్చు.

TVS Jupiter 125 SmartXonnect price : అయితే ఈ కొత్త టీవీఎస్​ జూపిటర్​ 125లో ఇంజిన్​ మాత్రం మార్చలేదు. ఇందులో 124.8సీసీ సింగిల్​ సిలిండర్​, ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 8.18 హెచ్​పీ పవర్​ను, 10.5 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ధర ఎంతంటే..

ఈ కొత్త టీవీఎస్​ జూపిటర్​ స్మార్ట్​ఎక్స్​ఓనెక్ట్​ ఎక్స్​షోరూం ధర రూ. 96,855. రెండు రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. అవి.. ఎలిగెంట్​ రెడ్​, మాట్​ కాపర్​ బ్రాంజ్​. ఇక ఈ స్కూటర్​.. టీవీఎస్​ ఎన్​టార్క్​, హోండా యాక్టివ్​ 125, సుజుకీ ఏసెస్​ 125కి గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం