Upcoming smartphones in August : ఆగస్ట్‌లో లాంచ్‌కు సిద్ధమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Upcoming smartphones in August : లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి! ఆగస్ట్‌లో క్రేజీ మోడల్స్ లాంచ్‌కు సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలు..
Upcoming smartphones in August : ఆగస్ట్‌లో కొత్త కొత్త లాంచ్‌లతో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ కళకళలాడిపోనుంది. ఇండియాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో పలు ఆకర్షిణీయమైన గ్యాడ్జెట్స్ బయటకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్స్ లాంచ్‌తో పాటు వాటి ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
షావోమీ మిక్స్ ఫోల్డ్ 3..
మిక్స్ ఫోల్డ్ 3పై షావోమీ భారీ ఆశలే పెట్టుకుంది. చైనాలో ఇది ఆగస్ట్‌లో లాంచ్కానుంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5కి ఇది గట్టిపోటీనిచ్చే విధంగా ఉంటుందని సమాచారం. ఇందులోని కెమెరా ఫీచర్ హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
వివో వీ29 సిరీస్..
Vivo V29 series launch : వీ29 సిరీస్‌ను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది వివో సంస్థ. ఈ సిరీస్‌లో వివో వీ29, వివో వీ29 ప్రో వంటి మోడల్స్ ఉంటాయి. వివో ఎస్17 సిరీస్‌కు ఇవి రీబ్రాండెడ్ వర్షెన్లని సమాచారం. ఆగస్ట్‌లో చైనాలో లాంచ్ తర్వాత ఇది ఇండియాలోకి కూడా రానుంది.
రియల్మీ జీటీ 5..
పలు నివేదికల ప్రకారం.. జీటీ5ని అంతర్జాతీయంగా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది రియల్మీ సంస్థ. ఇదొక ఫ్లాగ్షిప్ మోడల్. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ ఇందులో ఉంటుంది. 144హెచ్‌జెడ్ ఓఎల్ఈడీ డిస్ప్లే స్టన్నింగ్‌గా ఉండనుంది. 50ఎంపీతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా దీని సొంతం.
ఇదీ చూడండి:- బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్.. వీటి ధర రూ. 10వేల కన్నా తక్కువే!
ఇన్ఫీనిక్స్ జీటీ 10 ప్రో..
ఆగస్ట్ 3న ఈ మోడల్ లాంచ్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా వస్తుందని సమాచారం.
రెడ్మీ 12 5జీ..
Redmi 12 launch date in India : ఆగస్ట్ 1న.. రెడ్మీ 12 5జీని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది షావోమీ సంస్థ. ఇదొక మచ్ అవైటెడ్ మోడల్. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా దీనిని రూపొందించింది సంస్థ. ఫీచర్స్, ధరపై లీక్ అయిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
వన్‌ప్లస్ ఓపెన్..
హెచ్‌టీ టెక్ ప్రకారం.. ఓపెన్ అనే పేరుతో ఓ ఫోల్డెబుల్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది వన్‌ప్లస్ సంస్థ. ఈ వన్‌ప్లస్ ఓపెన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ, 2కే అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉంటాయి. న్యూయార్క్ వేదికగా ఆగస్ట్ 29న జరగనున్న ఈవెంట్లో సంస్థ దీనిని లాంచ్ చేస్తుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం