తెలుగు న్యూస్ / ఫోటో /
OnePlus new launches: భారత్ లో ఒకేసారి మూడు ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసిన వన్ ప్లస్
- OnePlus new launches: చైనా దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ వన్ ప్లస్.. మూడు ప్రొడక్ట్స్ ను ఒకేసారి భారత్ లో లాంచ్ చేసింది. అవి వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ మోడల్స్. వాటి వివరాలు ఈ ఫొటోల్లో..
- OnePlus new launches: చైనా దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ వన్ ప్లస్.. మూడు ప్రొడక్ట్స్ ను ఒకేసారి భారత్ లో లాంచ్ చేసింది. అవి వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ మోడల్స్. వాటి వివరాలు ఈ ఫొటోల్లో..
(1 / 9)
వన్ ప్లస్ నార్డ్ 3 5జీ స్మార్ట్ ఫోన్. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. ఒక వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో, మరో వేరియంట్ 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. 8 జీబీ వేరియంట్ ధర రూ. 33,999, కాగా, 16 జీబీ వేరియంట్ ధర రూ.37,999. (OnePlus)
(2 / 9)
ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్ ను అమర్చారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్లాట్ ఫామ్ పై ఆక్సిజన్ ఓఎస్ 13.1 పై పని చేస్తుంది.. (OnePlus)
(3 / 9)
వన్ ప్లస్ నార్డ్ 3 లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అవి 50 ఎంపీ ప్రైమరీ (సోనీ ఐఎంఎక్స్), 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది.(OnePlus)
(4 / 9)
వన్ ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్ లో 6.74 ఇంచ్, అమొలెడ్ డిస్ ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేటు 120 హెర్జ్స్. మాగ్జిమమ్ బ్రైట్ నెస్ 1450 నిట్స్.(OnePlus)
(5 / 9)
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 26,999. హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ తో రూ. 28,999 లకు లభిస్తుంది.(OnePlus)
(6 / 9)
నార్డ్ సీఈ 3 లో స్నాప్ డ్రాగన్ 782 జీ చిప్ సెట్ ను అమర్చారు. ఇందులో నార్డ్ 3 తరహాలోనే కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. (OnePlus)
(7 / 9)
నార్డ్ సీఈ 3 లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది.(OnePlus)
(8 / 9)
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఆర్ ధర రూ. 2,199. వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఆమెజాన్ సహా పలు ఈ కామర్స్ సైట్స్ లోనూ లభిస్తాయి. జులై 15 నుంచి ఈ బడ్స్ ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. (OnePlus)
ఇతర గ్యాలరీలు