Maruti New Cars : మారుతి నుంచి రానున్న మరో మూడు కొత్త కార్లు.. ఇందులో 7 సీటర్ కూడా-three more new suv cars coming from maruti suzuki including 7 seater know other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti New Cars : మారుతి నుంచి రానున్న మరో మూడు కొత్త కార్లు.. ఇందులో 7 సీటర్ కూడా

Maruti New Cars : మారుతి నుంచి రానున్న మరో మూడు కొత్త కార్లు.. ఇందులో 7 సీటర్ కూడా

Anand Sai HT Telugu

Maruti New Cars : భారతదేశంలో మారుతి సుజుకికి మంచి పేరు ఉంది. ఈ కంపెనీ కార్లు అంటే జనాలు ఎక్కువగా ఇష్టపడుతారు. మారుతి ఎప్పటికప్పుడు కార్లను అప్‌డేట్ చేస్తూ మార్కెట్‌లోకి వస్తుంది. మరో మూడు కొత్త కార్లను తీసుకురానుంది.

మారుతి సుజుకి కొత్త కార్లు

భవిష్యత్తులో కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం గుడ్‍‌న్యూస్. దేశంలో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతి సుజుకి రాబోయే రోజుల్లో తన అనేక మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వార్తా వెబ్సైట్ గాడివాడిలో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం, కంపెనీ రాబోయే మోడల్లో 7-సీటర్ కూడా ఉంది. మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న మారుతి 3 మోడళ్ల గురించి తెలుసుకుందాం..

7-సీటర్ మారుతి గ్రాండ్ విటారా

మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారతీయ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా 7-సీటర్ వేరియంట్‌ను వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రాబోయే 7 సీటర్ మారుతి సుజుకి గ్రాండ్ విటారాను 1.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌గా పవర్ ట్రెయిన్‌గా ఉపయోగించవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ

మారుతి సుజుకి కొత్త మైక్రో ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మారుతి సుజుకి మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి ఎస్‌యూవీలకు పోటీ ఇవ్వనుంది. రాబోయే మారుతి మైక్రో ఎస్‌యూవీలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను పవర్ ట్రెయిన్‌గా ఉపయోగించవచ్చని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

మారుతి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది. ఇప్పుడు మారుతి ఫ్రాంక్స్ విజయాన్ని పరిగణనలోకి తీసుకొని కంపెనీ తన అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది అంటే 2025లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ విడుదల చేయవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.