Million followers on Threads: మూడే పోస్ట్ లు.. మిలియన్ ఫాలోవర్లు.. థ్రెడ్స్ లో యూట్యూబర్ వరల్డ్ రికార్డ్-this youtuber is the first person to hit a million followers on metas threads ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Million Followers On Threads: మూడే పోస్ట్ లు.. మిలియన్ ఫాలోవర్లు.. థ్రెడ్స్ లో యూట్యూబర్ వరల్డ్ రికార్డ్

Million followers on Threads: మూడే పోస్ట్ లు.. మిలియన్ ఫాలోవర్లు.. థ్రెడ్స్ లో యూట్యూబర్ వరల్డ్ రికార్డ్

HT Telugu Desk HT Telugu
Jul 07, 2023 02:21 PM IST

Threads record: ట్విటర్ కు పోటీగా ఇటీవల మెటా లాంచ్ చేసిన మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్స్ (Threads) లో సంచలనలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఒక ఫేమస్ యూ ట్యూబర్ థ్రెడ్స్ లో 10 లక్షల ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

థ్రెడ్స్ లో రికార్డు సృష్టించిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్
థ్రెడ్స్ లో రికార్డు సృష్టించిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్

Threads record: ట్విటర్ కు పోటీగా ఇటీవల మెటా లాంచ్ చేసిన మైక్రో బ్లాగింగ్ యాప్ థ్రెడ్స్ (Threads) లో సంచలనలు నమోదు అవుతూనే ఉన్నాయి. ఒక ఫేమస్ యూ ట్యూబర్ ‘మిస్టర్ బీస్ట్’ థ్రెడ్స్ లో 10 లక్షల ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.

Threads record: జస్ట్ 20 ఏళ్ల వయస్సే..

అమెరికాలో ఫేమస్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్ సన్ ఈ రికార్డు సాధించాడు. అతడు మిస్టర్ బీస్ట్ గా ప్రపంచ వ్యాప్తంగా నెటిజనుల్లో పాపులర్. అతడి వయస్సు 25 సంవత్సరాలు మాత్రమే. ఫేస్ బుక్, ఇన్ స్టాల యాజమాన్య సంస్థ మెటా తాజాగా లాంచ్ చేసిన థ్రెడ్స్ లో అతడు 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు. చివరకు, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ను సైతం అతడు ఈ విషయలో అధిగమించాడు.

మూడే పోస్ట్ లతో..

థ్రెడ్స్ లో జాయిన్ అయిన కొన్ని గంటల్లోనే మిస్టర్ బీస్ట్ (MrBeast) ఈ ఫీట్ ను సాధించడం విశేషం. అంతేకాదు.. థ్రెడ్స్ లో అతడు పోస్ట్ చేసినవి కేవలం మూడంటే మూడే పోస్ట్ లు. మరికొన్ని గంటల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరింది. దీన్ని బట్టి అతడు ఎంత ఫేమసో అర్థం చేసుకోవచ్చు. 9,99,999 నుంచి 10 లక్షలకు అతడి ఫాలోవర్ల సంఖ్య మారుతున్న సమయంలో వీడియో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశారు.

‘ట్విటర్ ను చీట్ చేస్తున్నా’

ఈ రికార్డు సాధించడంపై మిస్టర్ బీస్ట్ స్పందిస్తూ.. ‘నేను ట్విటర్ ను మోసం చేస్తున్నానా?.. ట్విటర్ పోలీస్ కు ఈ విషయం తెలియనివ్వకండి’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇకనైనా తనను ట్విటర్ కు సీఈఓ చేయాలి కదా అని జుకర్ బర్గ్ ను ట్యాగ్ చేసి మరీ సరదాగా డిమాండ్ చేశాడు. ఈ కామెంట్ ను కూడా ఆయన ట్విటర్ లో షేర్ చేయడం విశేషం. ట్విటర్ లో ఆయన ప్రొఫైల్ ఇప్పుడు ట్విటర్ కిల్లర్ గా మారింది.

యూట్యూబ్ లో 16.5 కోట్ల ఫాలోవర్లు

జిమ్మీ డోనాల్డ్ సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ కు యూ ట్యూబ్ లో 16.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ట్విటర్ లో అతడి ఫాలోవర్ల సంఖ్య 2.1 కోట్లు. ఇన్ స్టా లోనూ అతడికి కోట్లలోనే ఫాలోవర్లు ఉన్నారు. థ్రెడ్స్ లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రముఖుల్లో ఓప్రా విన్ ఫ్రే, షకీరా, చెఫ్ గోర్డన్ రామ్సే.. తదితరులు ఉన్నారు. ప్రస్తుతం థ్రెడ్స్ భారత్, యూఎస్, కెనడా, బ్రిటన్, జపాన్ సహా దాదాపు 100 దేశాల్లో యూజర్లకు అందుబాటులో ఉంది.

Whats_app_banner