'Threads' Explainer: మైక్రో బ్లాగింగ్ యాప్ ‘థ్రెడ్స్ (Threads)’ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో లభిస్తోంది. ఈ యాప్ ను మెటా ఎలాంటి హడావుడి లేకుండా, అధికారికంగా ప్రకటించకుండా లాంచ్ చేయడం విశేషం. జులై 6వ తేదీని లాంచింగ్ డేట్ గా మెటా పేర్కొంది. ప్రస్తుతానికి ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నే ఈ థ్రెడ్ (Threads) వాడుకుంటోంది. యూజర్లు కూడా తమ ఇన్ స్టా క్రెడెన్షియల్స్ తో ఇందులో లాగిన్ కావచ్చు.
ప్రస్తుతానికి ఈ ‘థ్రెడ్స్ (Threads)’ యాప్ ను ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాతో లింక్ చేశారు. దాంతో, ఇన్ స్టాగ్రామ్ లో ఇప్పటికే అకౌంట్స్ ఉన్నవారికి ‘థ్రెడ్స్’ కు సైన్ అప్ కావాలని, థ్రెడ్స్ లో ప్రొఫైల్ రూపొందించుకోవాలని కోరుతూ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. భారత్ లోని ఇన్ స్టా యూజర్లకు కూడా ఈ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. చాలామంది ఇన్ స్టా లాగిన్ వివరాలతో థ్రెడ్స్ (Threads) కు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే, కొందరు యూజర్లకు ఇన్ స్టా నుంచి థ్రెడ్స్ లోకి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ ‘టికెట్’ రాలేదు. వారు థ్రెడ్స్ లో రిజిస్టర్ చేసుకోవడాని మరో మార్గం ఉంది.
దాదాపు అందరికీ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో థ్రెడ్స్ యాప్ అందుబాటులో ఉంది. వారు తమ ఇన్ స్టా గ్రామ్ లాగిన్ వివరాలతో సైన్ అప్ చేసుకోవచ్చు. లేదా ఈ కింది స్టెప్స్ ద్వారా కూడా లాగిన్ కావచ్చు.
ప్రస్తుతానికైతే, ఆ ఆప్షన్ లేదు. ఇన్ స్టా క్రెడెన్షియల్స్ తో థ్రెడ్స్ యాప్ లోకి లాగిన్ కావడం మాత్రమే సాధ్యమవుతుంది. ఇన్ స్టా లోని ఫాలోవర్లు ఆటోమేటిక్ గా థ్రెడ్ కు ఇంపోర్ట్ కారు. ప్రస్తుతానికి థ్రెడ్స్ (Threads) లో యాడ్స్ లేవు. కానీ, భవిష్యత్తులో యాడ్స్ వస్తాయని, అందుకోసం ఇన్ స్టా తరహాలోనే యూజర్ల మెటా డేటాను సేకరిస్తామని మెటా సంస్థ వెల్లడించింది. కాగా, థ్రెడ్స్ ను లాంచ్ చేసిన నాలుగు గంటల్లోనే 50 లక్షల మంది యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (Meta CEO Mark Zuckerberg) వెల్లడించారు. ఇన్ స్టా తో లింక్ అయి ఉండడం వల్ల, ట్విటర్ (Twitter) యూజర్ల సంఖ్యను థ్రెడ్స్ త్వరలోనే చేరుకుంటుందని భావిస్తున్నారు. డిసెంబర్ 2022 నాటికి ట్విటర్ (Twitter) లో 335 మిలియన్ల (33.5 కోట్ల) యాక్టివ్ యూజర్లు ఉన్నారు.