CNG Bike : 330 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ సీఎన్‌జీ బైక్‌కు మంచి డిమాండ్.. అమ్మకాల్లో తోపు-this 330 km mileage bajaj freedom 125 cng bike get huge demand 11000 units sold in october 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cng Bike : 330 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ సీఎన్‌జీ బైక్‌కు మంచి డిమాండ్.. అమ్మకాల్లో తోపు

CNG Bike : 330 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ సీఎన్‌జీ బైక్‌కు మంచి డిమాండ్.. అమ్మకాల్లో తోపు

Anand Sai HT Telugu
Nov 05, 2024 09:32 AM IST

Bajaj Freedom 125 CNG Bike : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌గా బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ బైక్ అమ్మకాల్లోనూ జోరు చూపించింది. రికార్డు స్థాయిలో కస్టమర్లు కొనుగోలు చేశారు.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ మోటార్ సైకిల్
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్జీ మోటార్ సైకిల్

బజాజ్ ఆటోకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. కస్టమర్ల ఇంట్రస్ట్‌కు తగ్గట్టుగా కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125 జూలై 2024లో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్‌కు భారీ డిమాండ్ ఉంది. అధిక సంఖ్యలో కొనుగోలుదారులు ఇష్టం చూపిస్తున్నారు. కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ విక్రయ గణాంకాలు బయటకి వచ్చాయి. పండుగల సీజన్‌ అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

బజాజ్ జులై నుంచి నవంబర్ 3 వరకు మొత్తం 20,942 యూనిట్ల ఫ్రీడమ్ 125 బైకులను విక్రయించింది. ఇందులో ఒక్క అక్టోబర్‌లోనే 11,041 యూనిట్లు, సెప్టెంబర్‌లో 4,937 యూనిట్లు, ఆగస్టులో 4,111 యూనిట్లు, జూలైలో 272 యూనిట్లు అమ్ముడయ్యాయి. నవంబర్ 1 నుంచి 3 వరకు 581 యూనిట్లు అమ్ముడయ్యాయి.

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ దేశవ్యాప్తంగా 77 నగరాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీని ధర కనిష్టంగా రూ.95 వేల నుంచి గరిష్టంగా రూ.1.10 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)గా నడుస్తోంది. డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ, డిస్క్ ఎల్ఈడీ అనే 3 వేరియంట్‌లలో ఉంది. బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ 125సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్/సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌తో 9.4 పీఎస్ హార్స్ పవర్, 9.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది.

కొత్త మోటార్‌సైకిల్‌లో ఒక్కొక్కటి 2 లీటర్/కేజీ కెపాసిటీ గల పెట్రోల్ అండ్ సీఎన్‌జీ ఇంధన ట్యాంకులు ఉన్నాయి. ఇది మొత్తం 330 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది (పెట్రోల్ మోడ్ 130 కి.మీ., సీఎన్‌జీ మోడ్ 200 కి.మీ).

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ చాలా అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌సీడీ డిస్‌ప్లేతో సహా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్-గ్రే, ప్యూటర్ గ్రే-బ్లాక్ అండ్ రేసింగ్ రెడ్ వంటి అనేక కలర్ ఆప్షన్స్‌లో కూడా అందుబాటులో ఉంది.

బైక్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. రైడర్ సేఫ్టీ కోసం డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఇది 147 కిలోల బరువును కలిగి ఉంది. అద్భుతమైన చక్రాలు, టైర్లను కలిగి ఉంది. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మెుత్తానికి భారీ సంఖ్యలో కస్టమర్లను సొంతం చేసుకుంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం