Tesla robotaxis : మళ్లీ అద్భుతం చేసిన ఎలాన్​ మస్క్​- టెస్లా ‘రోబోట్యాక్సీ’లను చూశారా?-tesla cybercab robotaxis are here and the world may never be the same again ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla Robotaxis : మళ్లీ అద్భుతం చేసిన ఎలాన్​ మస్క్​- టెస్లా ‘రోబోట్యాక్సీ’లను చూశారా?

Tesla robotaxis : మళ్లీ అద్భుతం చేసిన ఎలాన్​ మస్క్​- టెస్లా ‘రోబోట్యాక్సీ’లను చూశారా?

Sharath Chitturi HT Telugu
Oct 11, 2024 01:47 PM IST

Tesla Cybercab : టెస్లా రెండు డ్రైవర్​లెస్ రోబోటాక్సీ మోడళ్లను ఆవిష్కరించింది! వీటి పేర్లు సైబర్​క్యాబ్​, రోబోవాన్. ఇవి 2026 లో ప్రొడక్షన్​లోకి వెళతాయు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మచ్​ అవైటెడ్​ టెస్లా రోబోట్యాక్సీ..
మచ్​ అవైటెడ్​ టెస్లా రోబోట్యాక్సీ.. (via REUTERS)

దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​ మరో అద్భుతాన్ని సృష్టించారు! మచ్​ అవైటెడ్​ రోబోట్యాక్సీలను తాజాగా ఆయన ఆవిష్కరించారు. ఈ డ్రైవర్​లెస్​ మోడళ్ల పేర్లు సైబర్​క్యాబ్​, రోబోవాన్​. లాస్​ ఏంజెల్స్​లో గురువారం జరిగిన ఒక ప్రైవేట్​ ఈవెంట్​లో ఈ రోబోట్యాక్సీలను పరిచయం చేశారు. 2026లో వీటి ప్రొడక్షన్​ ప్రారంభంకానుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే, 2027లో ఈ డ్రైవర్​లెస్​ టెస్లా రోబోట్యాక్సీలు రోడ్డు మీద దర్శనిస్తాయి. వీటి ద్వారా భవిష్యత్తులో ట్యాక్సీల రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చేందుకు ఎలాన్​ మస్క్​ ప్లాన్​ చేస్తున్నారు.

టెస్లా రోబోట్యాక్సీలు ఇవే..

బార్​బంక్​లోని వార్నర్​ బ్రో స్టూడియోలే జరిగిన "వీ- రోబోట్​" ఈవెంట్​లో సైబర్​క్యాబ్​ని టెస్లా ఆవిష్కరించింది. ఇదొక 2 డోర్​ హ్యాచ్​బ్యాక్​ విత్​ కూపే స్టైలింగ్​లా కనిపిస్తోంది. దీని డిజైన్​ టెస్లా సైబర్​ట్రక్​తో చాలా వరకు పోలి ఉంది. ఈ టెస్లా వెహికిల్​లో హెడ్​ల్యాంప్​, టెయిల్​ల్యాంప్​ స్థానంలో హారిజాంటల్​ లైట్​ బార్స్​ ఉన్నాయి.

ఈ టెస్లా సైబర్​క్యాబ్​ ధర 30వేల డాలర్లుగా ఉండొచ్చు. అంటే అది సుమారు రూ. 25.19లక్షలు. ఇందులో స్టీరింగ్​ వీల్​ ఉండదు, పెడల్స్​ ఉండవు. మనం లోపల కూర్చోవడం తప్ప ఏం చేయడానికి ఉండదు! అందుకే ఇదొక ట్రూ డ్రైవర్​లెస్​ ఎక్స్​పీరియెన్స్​ అని అందరు అంటున్నారు. ఇంటీరియర్​లో 2 సీట్లు, ఆర్మ్​రెస్ట్​, కప్​హోల్డర్స్​ ఉంటాయి. భారీ ఇన్​ఫోటైమ్​మెంట్​ సిస్టెమ్​ ఉంటుంది. డిస్క్​ టైప్​ వీల్​ కవర్స్​ వస్తున్నాయి. అంతేకాదు ఈ టెస్లా రోబోట్యాక్సీని ఎలక్ట్రోమాగ్నెటిక్​ ఇండక్షన్​ ద్వారా వయర్స్​ లేకుండానే ఛార్జ్​ చేయొచ్చు. ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ కోసం ఇందులో కెమెరాలు, ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఫీచర్లు మెండుగా ఉంటాయి.

ఇక రోబోవాన్​ ట్యాక్సీలో ఏకంగా 20 మంది ప్రయాణించవచ్చు! దీని ప్రొడక్షన్​ టైమ్​లైన్​, ఇతర వివరాలను సంస్థ ప్రకటించలేదు.

రోబోవాన్​
రోబోవాన్​ (Tesla)

వాస్తవానికి ఫుల్లీ ఆటోమెటిక్​ కార్స్​ని తయారు చేస్తానని ఎలాన్​ మస్క్​ దాదాపు దశాబ్ద కాలం ముందే చెప్పారు. ఎట్టకేలకు ఆయన విజన్​ ప్రపంచం ముందుకు వచ్చింది. రోబోటాక్సిల గురించి చేసిన తొలి వాగ్దానాలు 2016 లో వచ్చాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నాయని మస్క్ చెప్పారు. 2020లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు రోడ్లపైకి వస్తాయని 2019లో హామీ ఇచ్చారు. ఆ తర్వాత 2024 వరకు గడువు పొడిగించగా, ప్రస్తుతానికి మస్క్ డ్రైవర్​లెస్ వాహనాలు 2026లో ఉత్పత్తి కానున్నాయి.

అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న టెస్లా మోడళ్లను ఫుల్లీ ఆటోమెటిక్​ కార్లుగా మార్చేందుకు టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డ్రైవ్ ల తరువాత సైబర్​క్యాబ్ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుండటం మంచి విషయం. రానున్న రోజుల్లో ఈ రోబోటాక్సీస గురించి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం