Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!-tesla remains silent and yet to communicate its india plans says official ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!

Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం.. ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో!

Sharath Chitturi HT Telugu
May 19, 2024 11:15 AM IST

Telsa India news : ఎలాన్​ మస్క్​ టెస్లా.. ఇండియా ఎంట్రీపై మౌనంగా ఉంటోంది. భారత అధికారులకు ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్​ ఇవ్వలేదు.

ఇండియా ఎంట్రీపై టెస్లా మౌనం!
ఇండియా ఎంట్రీపై టెస్లా మౌనం! (AFP)

Elon Musk Tesla : అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కి చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా.. ఇండియాలో ఎంట్రీపై అనిశ్చితి కొనసాగుతోంది! అంతర్జాతీయ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థలను ఆకర్షించేందుకు.. ఈ ఏడాది మార్చ్​లో కొత్త ఈవీ పాలసీని భారత్​ ప్రవేశపెట్టినా.. టెస్లా ఇంకా మౌనంగా ఉంటుండటం చర్చలకు దారితీసింది. మరి ఎలాన్​ మస్క్​కి ఇంకేం కావాలో? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియాలో ఎంట్రీపై టెస్లా మౌనం..

సంబంధిత అధికారుల ప్రకారం.. ఇండియాలో టెస్లా ఎంట్రీపై ఎలాన్​ మస్క్​ టీమ్​ మౌనంగా ఉంటోంది. కొత్త ఈవీ పాలసీ నేపథ్యంలో, ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్​ వెహికిల్​ మేన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ని ఏర్పాటు చేసే విషయంలో ఎలాన్​ మస్క్​ టీమ్​ నుంచి భారత అధికారులకు ఇంకా ఎలాంటి కమ్యూనికేషన్​ అందలేదు. గత నెలలో ఇండియాకు రావాల్సి ఉన్న ఎలాన్​ మస్క్​.. చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్న నేపథయ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

'ఇండియాకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఎదురుచూస్తున్నా' అని ఏప్రిల్​ తొలినాళ్లల్లో ట్వీట్​ చేసిన మస్క్​.. కొన్ని రోజులకే.. పర్యటన వాయిదపడినట్టు ప్రకటించారు. అంతేకాదు.. ఇండియాను కాదని, చైనాకు వెళ్లి, అక్కడ టెస్లా వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారు.

ఇదీ చూడండి:- Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Tesla in India : "ఈవీ పాలసీ అందరికి తగ్గట్టుగానే రూపొందించాము. టెస్లా వాళ్లు మౌనంగా ఉంటున్నారు," అని ఒక ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

2023 జూన్​లో ప్రధాని మోదీ అమెరికా వెళ్లినప్పుడు.. ఎలాన్​ మస్క్​ని కలిశారు. ఇండియాలో టెస్లా ఎంట్రీపై సుదీర్ఘంగా చర్చించారు. వాస్తవానికి 2022 నుంచి టెస్లా ఇండియా ఎంట్రీపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ ఇప్పటికీ ఎలాన్​ మస్క్​ బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓసారు.. అంతా సిద్ధమని, ప్లాంట్​ ఏర్పాటుకు రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. కానీ దాని మీదా ఎలాంటి ప్రోగ్రెస్​ కనిపించలేదు.

పన్ను విషయంలో టెస్లా- భారత ప్రభుత్వంపై చాలా కాలం పాటు ప్రతిష్ఠంభన కనిపించింది. ట్యాక్స్​లు తగ్గిస్తే.. టెస్లాను బయట తయారు చేసి ఇండియాలో విక్రయిస్తామని మస్క్​ అనేవారు. అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. ఇండియాలో కచ్చితంగా ప్లాంట్​ పెట్టాలని తేల్చిచెప్పింది.

Tesla in India news : వీటన్నింటి మధ్య.. కొత్త ఈవీ పాలసీ కొన్ని నెలల క్రితమే బయటకు వచ్చింది. ఇండియాలో 500 మిలియన్​ డాలర్ల కనీస పెట్టుబడితో మేన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ పెడితే.. దిగుమతి సుంకాలు తగ్గిస్తామని అందులో ఉంది. టెస్లా వంటి సంస్థలను ఆకర్షించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత కథనం