Smart Phone Discount : అదిరిపోయే ఆఫర్.. రూ.15 వేలలోపే 5జీ ఫోన్.. 108 ఎంపీ కెమెరా-tecno spark 20 pro 5g featuring 108mp camera available with best offers and discount under 15000 thousand smart phone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Phone Discount : అదిరిపోయే ఆఫర్.. రూ.15 వేలలోపే 5జీ ఫోన్.. 108 ఎంపీ కెమెరా

Smart Phone Discount : అదిరిపోయే ఆఫర్.. రూ.15 వేలలోపే 5జీ ఫోన్.. 108 ఎంపీ కెమెరా

Anand Sai HT Telugu
Jul 28, 2024 06:00 PM IST

Tecno Spark Discount : తక్కువ ధరలో 5జీ ఫోన్ కొనాలి అని చూస్తే.. మంచి ఆఫర్ నడుస్తోంది. టెక్నో స్పార్క్ ఫోన్‌ను రూ.15ల ధరతో కొనుగోలు చేయవచ్చు.

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ ధర
టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ ధర

మీరు తక్కువ ధరలో అద్భుతమైన కెమెరాతో ఫోన్ పొందాలనుకుంటే, అమెజాన్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ఈ బంపర్ ఆఫర్‌లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో శక్తివంతమైన ఫోన్-టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ భారీ డిస్కౌంట్లతో లభిస్తుంది. 16 జీబీ ర్యామ్(8జీబీ స్టోరేజ్), 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఈ సేల్‌లో అన్ని బ్యాంకు కార్డులపై రూ.2 వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ.13,999కే అందుబాటులోకి రానుంది.

క్యాష్‌బ్యాక్ కూడా

ఈ ఫోన్‌పై రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.14,600 వరకు తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

అదిరిపోయే ఫీచర్లు

ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + ఎల్సీడీ ప్యానెల్, 2460×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్ట బ్రైట్ నెస్ లెవల్ 580 నిట్స్. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256డీజీబీ వరకు యూఎఫ్ఎస్ 2.0 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ మొత్తం ర్యామ్ 16 జీబీకి పెరిగింది.

ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో ఎల్ఈడి ఫ్లాష్‌తో మూడు కెమెరాలను అందిస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 2 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కంపెనీ అందిస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్గా ఉంది. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 10 వాట్ల రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఎక్స్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందిస్తోంది. కనెక్టివిటీ కోసం 5జీ ఎస్ఎ / ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ ఎల్టిఇ, వై-ఫై 802.11 (2.4 గిగాహెర్ట్జ్ + 5 గిగాహెర్ట్జ్), బ్లూటూత్ 5.1, జీపీఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ వంటి ఎంపికలు ఉన్నాయి.

Whats_app_banner