Best coolers for summer : అమ్మో వేసవి కాలం.. ఇవిగో బెస్ట్​ కూలర్స్​- ఇక రోజంతా చల్లచల్లగా ఉండండి!-techology gadgets top 5 best high capacity coolers to buy in summer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Coolers For Summer : అమ్మో వేసవి కాలం.. ఇవిగో బెస్ట్​ కూలర్స్​- ఇక రోజంతా చల్లచల్లగా ఉండండి!

Best coolers for summer : అమ్మో వేసవి కాలం.. ఇవిగో బెస్ట్​ కూలర్స్​- ఇక రోజంతా చల్లచల్లగా ఉండండి!

Sharath Chitturi HT Telugu
Feb 23, 2024 09:00 AM IST

Best coolers for summer 2024 : సమ్మర్​ కోసం రెడీ అవుతున్నారా? తక్కువ ధరకు మంచి ఎయిర్​ కూలర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇది మీకోసమే! హై పర్ఫార్మెన్స్​తో కూడిన టాప్​ 5 ఎయిర్​ కూలర్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

 ఇవిగో బెస్ట్​ కూలర్స్!
ఇవిగో బెస్ట్​ కూలర్స్!

Which cooler is best for home : వేసవి కాలం వచ్చేసింది! ఫిబ్రవరి నుంచే వాతావరణం వేడివేడిగా ఉంటోంది. "ఫ్యాన్​లు సరిపోవడం లేదు. ఏదైనా మంచి కూలర్​ కొనుక్కోవాలి" అని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ సమ్మర్​ సీజన్​లో మీకు ఉపయోగపడే టాప్​ 5 హై- పర్ఫార్మెన్స్​ కూలర్స్​ లిస్ట్​ని మీకోసం మేము రూపొందించాము. వీటిని ఇప్పుడే కొనుక్కుంటే చౌకగా దొరుకుతాయి. లేదంటే.. డిమాండ్​తో పాటు ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే.. ఈ లిస్ట్​పై వెంటనే ఓ లుక్కేయండి..

వేసవి కాలంలో బెస్ట్​ కూలర్స్​ ఇవే..!

క్రాప్టన్​ ఓజోన్​ డెసర్ట్​ ఎయిర్​ కూలర్​ (88లీటర్లు):- దీని పవర్​ 190వాట్. ఎయిర్​ థ్రో 45 ఫీట్. ఎయిర్​ డెలివరీ 420 సీఎంహెచ్​. ఇందులో.. ఎవర్​లాస్ట్​ పంప్​, ఆటో ఫిల్​, 4 వే ఎయిర్​ డిఫ్లెక్షన్​, హై- డెన్సిటీ హనీకోంబ్​ ప్యాడ్స్​ వంటివి ఫీచర్స్​గా ఉన్నాయి. రస్ట్​ ఫ్రీ ఏబీఎస్​, థర్మోప్లాస్టిక్​ బాడీ డిజైన్​ దీని సొంతం. రిమెట్​ కంట్రోల్​ వెసులుబాటు లేకపోవడం, కదపడానికి ట్రాలీ లేకపోవడం దీని నెగిటివ్​ పాయింట్స్​. అమెజాన్​లో ఈ ఎయిర్​ కూలర్​ ధర రూ. 11,500గా ఉంది.

best coolers for summer 2024 India : క్రాంప్టన్​ ఓజెన్​ డెసర్ట్​ ఎయిర్​ కూలర్​ (55 లీటర్లు):- దీని కెపాసిటీ 55 లీటర్లు. ఎయిర్​ డెలివరీ 4250 సీఎంహెచ్​. ఎయిర్​ థ్రో 50 ఫీచ్​. పవర్​ 190 వాట్​. ఎవర్​లాస్ట్​ పంప్​, ఆటో ఫిల్​, 4 వే ఎయిర్​ డిఫ్లెక్షన్​, హై- డెన్సిటీ హనీకోంబ్​ ప్యాడ్స్​ వంటివి ఫీచర్స్​గా ఉన్నాయి. 550 స్క్వేర్​ ఫీట్​ రూమ్​కి సరిపోతుంది ఈ ఎయిర్​ కూలర్​. ఇందులో కూడా రిమోట్​ కంట్రోల్​ ఆప్షన్​ లేదు. కదపడానికి ట్రాలీ లేదు. దీని ధర రూ. 10,700.

హావెల్స్​ సెలియా ఐ డెసర్ట్​ ఎయిర్​ కూలర్​ (55 లీటర్లు):- ఈ కూలర్​ ఎయిర్​ ఫ్లో కెపాసిటీ 3500 ఎం3/హెచ్​ఆర్​. లో నాయిస్​ కూలింగ్​, ఐస్​ ఛాంబర్​, ఫుల్​ ఫంక్షన్​ రిమోట్​, కొలాప్సిబుల్​ లోవ్రెస్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. పవర్​ 220 వాట్స్​. డైమెన్షన్​ 66x51x11.5 సెంటీమీటర్లు. మేన్యువల్​ కంట్రోల్​ సరిగ్గా లేకపోవడం నెగిటివ్​ పాయింట్​.

Which cooler is best for summer? : సింఫనీ టచ్​ 55 పర్సనల్​ ఎయిర్​ కూలర్​:- ఇది.. 30 స్క్వేర్​ మీటర్స్​ని కవర్​ చేస్తుంది. 4 సైడ్​ ఆస్పేన్​ ప్యాడ్స్​, డబుల్​ బ్లోవర్స్​ కూలింగ్​ టెక్నాలజీ దీని సొంతం. వాటర్​ ట్యాంక్​ కెపాసిటీ 55 లీటర్లు. పవర్​ 185 వాట్స్​. ఐ-ప్యూర్​ టెక్నాలజీ, క్లోజెబుల్​ లోవెర్స్​, ఇన్​వర్టెడ్​ కంపాటిబులుటీ వంటివి ఫీచర్స్​గా ఉన్నాయి. ఎర్గోనామిక్​ డయల్​ నాబ్స్​ డిజైన్​ దీని సొంతం. ఐ ప్యూర్​ టెక్నాలజీ ఉండటం పెద్ద పాజిటివ్​ పాయింట్​. కానీ మేన్యువల్​ ఆపరేషన్​ సరిగ్గా ఉండదని తెలుస్తోంది. సమ్మర్​ కోసం బెస్ట్​ ఎయిర్​ కూలర్​ ధర రూ. 13,899.

బజాజ్​ డీసీ 55 డీఎల్​ఎక్స్​ డెసర్ట్​ ఎయిర్​ కూలర్​:- ఈ కూలర్​ కెపాసిటీ 54 లీటర్లు. హెక్సాకూల్​, టర్బో ఫ్యాన్​ టెక్నాలజీ దీని సొంతం. 600 స్క్వేర్​ ఫీట్​ని కవర్​ చేస్తుంది. ఐస్​ ఛాంబర్​, 3 సైడ్​ హనీకూంబ్​ ప్యాడ్స్​, పవర్​ఫుల్​ ఎయిర్​ థ్రో వంటి ఫీచర్స్​ ఇందులో ఉన్నాయి. 190 వాట్స్​ పవర్​ కావాల్సి ఉంటుంది. కూలింగ్​ ఎఫీషియెంట్​గా ఉండటం దీని ప్లస్​ పాయింట్​. కానీ సైజ్​ పెద్దగా ఉండటం, డిజిటల్​ కంట్రోల్స్​ లేకపోవడం మైనస్​ పాయింట్స్​. ఈ ఎయిర్​ కూలర్​ ధర రూ. 12,490.

Which cooler brand is best? : వీటిల్లో మీకు నచ్చింది, మీ రూమ్​కి సెట్​ అయ్యేది చూసుకుని వెంటనే కొనుక్కుంటే బెటర్​! లేకపోతే.. ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు

Whats_app_banner

సంబంధిత కథనం