TCS Q1 results: క్యూ1 ఫలితాలను ప్రకటించిన టీసీఎస్; డివిడెండ్ కూడా..
2024 -25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY25) ఆర్థిక ఫలితాలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురువారం ప్రకటించింది. ఈ క్యూ1 లో టీసీఎస్ కన్సాలిడేటెడ్ ఆదాయం 5.4 శాతం పెరిగి 626.13 బిలియన్ రూపాయలకు చేరుకుంది. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం ఆదాయం రూ.622.07 బిలియన్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
గత త్రైమాసికాల్లో సాధించిన భారీ డీల్స్ కారణంగా భారతదేశపు అగ్రశ్రేణి ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి త్రైమాసికం (Q1FY25) లో ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని నివేదించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 5.4 శాతం పెరిగి 626.13 బిలియన్ రూపాయలకు చేరుకుంది. ఎల్ఎస్ఈజీ డేటా ప్రకారం ఆదాయం రూ.622.07 బిలియన్లుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
శాలరీ హైక్స్ తో..
క్యూ1 ((Q1FY25)) లో ఈబీఐటీ మార్జిన్ 24.7 శాతానికి తగ్గడంతో త్రైమాసికంలో వేతన పెంపు నిర్ణయాల కారణంగా కంపెనీ మార్జిన్లు కొంత దెబ్బతిన్నాయి. ఈ త్రైమాసికంలో ఒక్కో షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, మార్కెట్లలో సర్వతోముఖ వృద్ధితో కొత్త ఆర్థిక సంవత్సరం పటిష్టంగా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ అన్నారు. ‘‘మేము మా క్లయింట్ సంబంధాలను విస్తరించడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో కొత్త సామర్థ్యాలను సృష్టించడం, నూతన ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తున్నాము. వీటిలో ఫ్రాన్స్ లో కొత్త AI-కేంద్రీకృత టీసీఎస్ పాస్ పోర్ట్™, యుఎస్ లో IOT ల్యాబ్, లాటిన్ అమెరికా, కెనడా, యూరోప్ ల్లో మా డెలివరీ కేంద్రాలను విస్తరించడం మొదలైనవి ఉన్నాయి’’ అని కృతివాసన్ వెల్లడించారు.
టీసీఎస్ క్యూ1 రిజల్ట్స్
ఈ త్రైమాసికంలో టీసీఎస్ (TCS) ఆదాయం 2.24 శాతం పెరిగి రూ.62,613 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్ 24.7 శాతంగా నమోదైంది. నికర మార్జిన్ 19.2 శాతంగా ఉంది. భారత్ నేతృత్వంలోని ఎమర్జింగ్ మార్కెట్లలో రెండంకెల వృద్ధిని (61.8 శాతం వృద్ధి) సాధించినట్లు కంపెనీ తెలిపింది. దాదాపు అన్ని వర్టికల్స్ వరుస వృద్ధికి తిరిగి వచ్చాయి. ఇందులో తయారీ రంగం 9.4 శాతం, ఎనర్జీ, రిసోర్సెస్ అండ్ యుటిలిటీస్ 5.7 శాతం, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ 4 శాతం లాభపడ్డాయి.
డివిడెండ్ ఎంతంటే?
2024 -25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY25) ఆర్థిక ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ (Dividend) ను కూడా టీసీఎస్ ప్రకటించింది. అర్హత కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.10 మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ జూలై 20 అని, ఆగస్టు 5 న డివిడెండ్ అర్హత కలిగిన షేర్ హోల్డర్ల ఖాతాల్లో జమ అవుతుందని కంపెనీ తెలిపింది.
టాపిక్