Discounts on Tata cars : ఈ రెండు టాటా​ ఎస్​యూవీలపై రూ. లక్షల్లో డిస్కౌంట్స్​!-tata safari and harrier attract massive discounts in august 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Tata Cars : ఈ రెండు టాటా​ ఎస్​యూవీలపై రూ. లక్షల్లో డిస్కౌంట్స్​!

Discounts on Tata cars : ఈ రెండు టాటా​ ఎస్​యూవీలపై రూ. లక్షల్లో డిస్కౌంట్స్​!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2024 07:20 AM IST

టాటా సఫారీ, హారియర్​ ఎస్​యూవీలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు టాటా మోటార్స్​ ఎస్​యూవీలపై రూ. లక్షల్లో డిస్కౌంట్స్​!
ఈ రెండు టాటా మోటార్స్​ ఎస్​యూవీలపై రూ. లక్షల్లో డిస్కౌంట్స్​!

ఆగస్ట్​ నెలలో వాహనాలపై డిస్కౌంట్లను ఆటోమొబైల్​ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి టాటా మోటార్స్​ సైతం చేసింది. అమ్మకాల సంఖ్యను పెంచే ప్రయత్నంలో టాటా మోటార్స్ సఫారీ, హారియర్​లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ టాటా వెహికిల్స్​పై భారీ డిస్కౌంట్లు..

టాటా సఫారీ, హారియర్ ఎస్​యూవీల ఎంవై2023 మోడళ్లు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. టాటా సఫారీ అన్ని వేరియంట్లలో రూ .1.65 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. టాటా హారియర్ వేరియంట్​ను బట్టి రూ .1.45 లక్షల వరకు ప్రయోజనాలతో లభిస్తుంది. టాటా సఫారీ, హారియర్ ఎస్​యూవీలు ప్రస్తుతం రూ .16.19 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ .14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి.

టాటా సఫారీ, హారియర్ ఎస్​యూవీలు రెండూ కూడా ఎక్స్​టీరియర్, క్యాబిన్ లోపల అనేక డిజైన్ అంశాలను పంచుకుంటాయి. మెకానిక్స్​ విషయానికి వస్తే, సఫారీ- హారియర్ 2.0-లీటర్ క్రియోటెక్ టర్బోఛార్జ్​డ్ డీజిల్ ఇంజిన్​తో వస్తాయి. ఇది 6-స్పీడ్ మేన్యువల్ గేర్​బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. టార్క్ కన్వర్టర్ యూనిట్ కూడా ఉంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 168బీహెచ్​పీ పవర్, 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది.

ఆగస్టు 7న కర్వ్ ఈవీ విడుదల..

ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా కర్వ్ ఈవీని ఆగస్టు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా మోటార్స్​. లాంచ్ అయిన తరువాత, కర్వ్ ఈవీ బ్రాండ్ నుంచి ఇతర ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో చేరుతుంది. ఇది టాటా కర్వ్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్​గా వస్తుంది. ఈ కూపే ఎస్​యూవీ ఐసీఈ వేరియంట్ కూడా వస్తుంది. ఇండియాలో లాంచ్​ అవుతున్న తొలి కూపే ఎస్​యూవీ ఈ టాటా కర్వ్​. టాటా కర్వ్​ ఈవీ కూపే ఎస్​యూవీలో డ్యూయెల్-టోన్ థీమ్ ఉన్న క్యాబిన్​కి కాంతిని తీసుకువచ్చే పానోరమిక్ సన్​రూఫ్​ చూడవచ్చు. ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హోండా ఎలివేట్​, సిటీ, అమేజ్​పై భారీ డిస్కౌంట్లు..

పండుగ సీజన్​ సమీపిస్తుండటం, కార్ల అమ్మకాలను పెంచుకోవడం కోసం దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా, ఆగస్ట్​ నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. తన పోర్ట్​ఫోలియోలో బెస్ట్​ సెల్లింగ్​ వెహికిల్స్​ హోండా ఎలివేట్​, హోండా సిటీ, హోండా అమేజ్​లపై డిస్కౌంట్స్​ని ఇస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా.. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్​లో భాగంగా హోండా ఈ నెలలో ఏదైనా మోడల్​ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను సైతం అందిస్తోంది. ఆగస్టులో ఏ హోండా కారు కొనుగోలుపై ఎంత ఆదా చేయొచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

గతేడాది లాంచ్​ అయిన హోండా ఎలివేట్​ ఎస్​యూవీపై ఆగస్టులో రూ.65,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అమేజ్ సెడాన్​పై రూ .96,000 వరకు తగ్గింపును అందిస్తోంది.హోండా సిటీ, సిటీ హైబ్రిడ్ సెడాన్లపై ఆగస్టులో రూ.90,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం