Tata Curvv EV : వావ్ అనిపిస్తున్న టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్.. ఆ ఫీచర్స్ హైలైట్!
Tata Curvv EV launch date in India : టాటా కర్వ్ ఈవీ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ సమయంలో వెహికిల్ ఇంటీరియర్ టీజర్‌ని టాటా మోటర్స్ రివీల్ చేసింది.
టాటా మోటార్స్ ఆగస్టు 7న టాటా కర్వ్ ఈవీని భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ కొత్త కూపే ఎస్యూవీ ఎక్స్టీరియర్ని సంస్థ ఇప్పటికే ఆవిష్కరించింది. అంతేకాదు పూర్తిగా ఈ మోడల్ భారత రోడ్లపై కనిపించేసింది. కాగా టాటా మోటార్స్ ఇప్పుడు ఈ కర్వ్ ఈవీ ఇంటీరియర్‌ని కొత్త టీజర్ ద్వారా రివీల్ చేసింది. ఆ విశేషాలు..
టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్..
కొత్త ఫొటోల్లో టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్‌యూవీలో డ్యూయెల్-టోన్ థీమ్ ఉన్న క్యాబిన్‌కి కాంతిని తీసుకువచ్చే పానోరమిక్ సన్‌రూఫ్ చూడవచ్చు. ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇంజిన్ని స్టార్ట్ చేయడం/ఆపడం కోసం పుష్ బటన్, రీ-జెన్ లెవల్ని కంట్రోల్ చేయడం కోసం ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉంటాయి.
పంచ్ ఈవీ నుంచి తీసిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కూడా ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టెమ్ కొత్త నెక్సాన్ నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాబట్టి ఇది గ్లాస్ బ్లాక్ యూనిట్. లెథరెట్ అప్హోలిస్ట్రీతో కూడిన వెంటిలేటెడ్ సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్లు, గెస్చర్ యాక్టివేషన్‌తో పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఈ టాటా కర్వ్ ఈవీలో ఉండనున్నాయి. వెహికల్-టు-వెహికల్ ఛార్జింగ్, వెహికల్-టు-లోడ్ ఫంక్షనాలిటీని కూడా టాటా అందిస్తోంది. అదనంగా, 6-వే ఎలక్ట్రికల్ అడ్జెస్టిబుల్ డ్రైవర్ సీటు, కో-డ్రైవర్ సీటు ఉంటాయి. వెనుక సీటులో సెంటర్ కన్సోల్‌తో పాటు టూ స్టెప్ రెక్లైన్ ఫంక్షన్ ఉంటుంది. లెవల్ 2 ఏడీఏఎస్, డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్‌తో కూడిన ఈఎస్పీ, 6 ఎయిర్ బ్యాగులు, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టాటా కర్వ్ లాంచ్..
టాటా కర్వ్ కూపే ఎస్యూవీ లాంచ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది తొలుత ఈవీ సెగ్మెంట్లో అడుగుపెడుతుంది. అనంతరం ఐసీఈ ఇంజిన్ కూడా లాంచ్ అవుతుంది. అంతేకాదు.. కూపే ఎస్యూవీ సెగ్మెంట్లో లాంచ్ అవుతున్న తొలి వెహికిల్ ఈ టాటా కర్వ్ ఈవీ. త్వరలో లాంచ్‌కు రెడీ అవుతున్న సిట్రోయెన్ బసాల్ట్, దీనికి పోటీగా నిలువనుంది.
టాటా కర్వ్ ఈవీ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్ సమయానికి ధరతో పాటు అన్ని వివరాలపై క్లారిటీ వస్తుంది.
సంబంధిత కథనం