Tata Nexon CNG : లాంచ్‌కి ముందు.. టాటా నెక్సాన్ సీఎన్జీపై బిగ్ అప్డేట్!
Tata Nexon CNG launch date : లాంచ్‌కి ముందు టాటా నెక్సాన్ సీఎన్జీపై బిగ్ అప్డేట్! ఈ మోడల్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2024 మచ్ అవైటెడ్ లాంచ్‌లలో టాటా నెక్సాన్ సీఎన్జీ ఒకటి. ఇది రాబోయే పండుగ సీజన్‌కి ముందు, సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ మాదిరిగానే టాటా నెక్సాన్ సీఎన్జీ కూడా ఏఎంటీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) టెక్నాలజీని పొందుతుంది. దేశీయ ఆటో దిగ్గజం ఈ ఏడాది ప్రారంభంలో టియాగో- టిగోర్ మోడళ్లలో సీఎన్జీ-ఏఎంటీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఇదే సాంకేతికత నెక్సాన్లోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు. ఇది ఇప్పటికే ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ ఆకర్షణను మరింత పెంచుతుంది.
టియాగో సీఎన్జీ-ఏఎంటీ, టిగోర్ సీఎన్జీ -ఏఎంటీ మాదిరిగానే, టాటా నెక్సాన్ సీఎన్జీ-ఏఎంటీ కూడా ట్విన్-సీఎన్జీ సిలిండర్లు ఏఎంటీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ సాంకేతికత వినియోగదారులకు అఫార్డిబుల్ ఫ్యూయెల్, సౌకర్యవంతమైన క్లచ్ లెస్ డ్రైవింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.
టాటా నెక్సాన్ సీఎన్జీ: ఇంజిన్- స్పెసిఫికేషన్స్..
టాటా నెక్సాన్ సీఎన్జీ రెండు వేర్వేరు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, ఏఎంటీ యూనిట్ ఉంటాయి. ఈ ఎస్‌యూవీలో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సీఎన్జీపై కూడా పనిచేయగలదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118బీహెచ్పీ పవర్, 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది సీఎన్జీ మోడ్‌లో, ఎస్యూవీ కొంచెం తక్కువ పవర్, టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Motor vehicle tax : ప్రజలపై ప్రభుత్వం ‘ట్యాక్స్’ పిడుగు! భారీగా పెరగనున్న వాహనాల ధరలు..
టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీ ప్రస్తుతం పెట్రోల్-ఓన్లీ, డీజిల్-ఓన్లీ, ఎలక్ట్రిక్ వెహికిల్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. పెట్రోల్-సీఎన్జీ బై-ఫ్యూయెల్ పవర్ట్రెయిన్ టెక్నాలజీతో అందుబాటులో ఉన్న టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, టాటా పంచ్ మాదిరిగానే నెక్సాన్‌కి కూడా సీఎన్జీ టెక్నాలజీని జోడించడం జరుగుతుంది.
టాటా మోటార్స్ నెక్సాన్ సీఎన్జీ-ఏఎంటీ ధర గురించి ఇంకా వెల్లడించలేదు. ఇది నెక్సాన్ స్టాండర్డ్ వెర్షన్ల కంటే సుమారు రూ .80,000 ప్రీమియంతో వస్తుందని అంచనాలు ఉన్నాయి. టాటా నెక్సాన్ సీఎన్జీ లాంచ్ అయిన తరువాత మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్జీ వంటి మోడల్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది.
సంబంధిత కథనం