Discounts on Tata Motors EV's : ఈ టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు..!-tata motorss evs available with discounts check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Discounts On Tata Motors Ev's : ఈ టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు..!

Discounts on Tata Motors EV's : ఈ టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు..!

Sharath Chitturi HT Telugu
Mar 09, 2024 08:10 AM IST

Discounts on Tata Nexon EV : టాటా నెక్సాన్​ ఈవీ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇదే రైట్​ టైమ్​! టాటా మోటార్స్​ సంస్థ.. ఈవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. చెక్​ చేసేయండి!
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు.. చెక్​ చేసేయండి!

Tata Motors EV discounts in March : ఇండియన్​ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్​. ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఈవీ పోర్ట్​ఫోలియోకు విపరీతమైన డిమాండ్​ ఉంటుంది. చాలా మంది టాటా ఈవీలను కొనాలని చూస్తున్నారు. వీరిలో మీరూ ఒకరా? అయితే ఇది మీకోసమే! ఈ నెలలో పలు మోడల్స్​పై గరిష్ఠంగా రూ. 3.5లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది టాటా మోటార్స్​ సంస్థ. వాటిని ఇక్కడ చూసేయండి.

టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వెహికిల్స్​పై డిస్కౌంట్లు..​

ఇన్​వెంటరీని క్లియర్​ చేసుకునేందుకు తమ ఈవీలపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది టాటా మోటార్స్​. ఇవి.. 2023 మోడల్స్​కి మాత్రమే అమల్లో ఉన్నాయి. వీటితో పాటు 2024 నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీపైనా అట్రాక్టివ్​ ఆఫర్స్​ ఉన్నాయి.

బెస్ట్​ సెల్లింగ్​ టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ వేరియంట్​పై రూ. 2.3లక్షల వరకు క్యాష్​ డిస్కౌంట్​ లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 50వేలు ఇస్తోంది టాటా మోటార్స్​.

Tata Nexon EV on road price in Hyderabad : ఇక టాటా నెక్సాన్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ మ్యాక్స్​ వర్షెన్​పై రూ. 2.65లక్షల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 50వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​ని ఇస్తోంది సంస్థ.

ఇక టాటా టిగోర్​ ఈవీ కాంపాక్ట్​ సెడాన్​ 2023 మోడల్స్​పై గరిష్ఠంగా రూ. 1.05లక్షల డిస్కౌంట్​ లభిస్తోంది. ఇందులో రూ. 75వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 30వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​ వంటివి ఉన్నాయి. అన్ని వేరియంట్లకు ఇది వర్తిస్తుంది.

మరోవైపు.. 2023 నెక్సాన్​ ఈవీ అన్ని మోడల్స్​పై గ్రీన్​ బోనస్​ కింద రూ. 50వేలు తగ్గుతోంది. 2024 మోడల్స్​కి గ్రీన్​ బోనస్​ రూ. 20వేలుగా ఉంది. కాగా.. ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​కి మాత్రం క్యాష్​ డిస్కౌంట్స్​, ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు కనిపించడం లేదు.

ఇక 2023 టియాగో ఈవీ మోడల్స్​పై రూ. 65వేల బెనిఫిట్స్​ లభిస్తున్నాయి. ఇందులో.. రూ. 50వేల వరకు గ్రీన్​ బోనస్​, రూ. 15వేల వరకు ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ ఇస్తోంది సంస్థ. కాగా.. 2024 మోడల్స్​లో ఎక్స్​ఛేంజ్​ బోనస్​ రూ. 25వేలు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ రూ. 10వేలుగా ఉంది.

Tata Motors latest discounts : అయితే.. ఈ డిస్కౌంట్స్​ అన్నీ.. డీలర్​ ఎండ్​ నుంచి ఉన్నాయి. పైగా.. డిస్కౌంట్స్​, ఆఫర్స్​ అనేవి లోకేషన్​ బట్టి మారుతూ ఉంటాయి. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీపంలోని టాటా మోటార్స్​ డీలర్​షిప్​ షోరూమ్స్​ని సంప్రదించాల్సి ఉంటుంది.

టాటా వెహికిల్స్​ రేంజ్​..

టాటా నెక్సాన్​ ఈవీ ప్రైమ్​ వేరియంట్​ రేంజ్​ 312 కి.మీలుగా ఉంది. మ్యాక్స్​ వేరియంట్​ రేంజ్​ 437కి.మీలుగా ఉది. టిగోర్​ ఈవీలో ఉండే 26కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. గరిష్ఠంగా 315 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

సంబంధిత కథనం