Tata Motors price hike : వాహనాల ధరలను మళ్లీ పెంచిన టాటా మోటార్స్
Tata Motors price hike : కస్టమర్లకు మళ్లీ షాక్ ఇచ్చింది టాటా మోటార్స్. జులై 17 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.
Tata Motors price hike news : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. వాహనాల ధరలను మళ్లీ పెంచాలని ఫిక్స్ అయ్యింది. ధరల పెంపు ఈ నెల 17 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
వాహనాల ధరలు ఎంత పెరుగుతాయంటే..
తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని మోడల్స్, వేరియంట్లపై సగటు 0.6శాతం ప్రైజ్ హైక్ తీసుకుంటున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరగనున్నట్టు స్పష్టం చేసింది.
ధరల పెంపుపై ఎప్పుడూ చెప్పే కారణాలే ఈసారి కూడా చెప్పింది ఈ ఆటోమొబైల్ సంస్థ. ముడిసరకు ధరలు పెరుగుతున్నాయని, వాహనాల ధరల పెంపు తప్పడం లేదని వివరించింది. ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు ప్రైజ్ హైక్ తీసుకుంది ఈ సంస్థ. వాస్తవానికి ఏడాదిన్నర కాలంలో దేశంలో వాహనాల ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
Tata Motors latest news : అయితే.. కస్టమర్లకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించింది టాటా మోటార్స్. 2023 జులై 16 లోపు చేసుకునే బుకింగ్స్‌పై, 2023 జులై 31 వరకు అయ్యే డెలివరీలపై ధరల పెంపు భారాన్ని వేయబోమని వివరించింది.
టాటా నెక్సాన్, టాటా పంచ్, టాటా హారియర్, టాటా సఫారీ, టాటా ఆల్ట్రోజ్ వంటి మోడల్స్ సంస్థకు బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్నాయి. ఇక ఈవీ సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్. నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలు పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని మోడల్స్‌కు ఈవీ టచ్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
ఇదీ చూడండి:- Tata Altroz: టాటా ఆల్ట్రోజ్ అన్ని స్టాండర్డ్ మోడల్స్ కు సన్ రూఫ్ ఆప్షన్
జూన్ నెల సేల్స్ ఇలా..
Tata Motors price hike : జూన్ నెలకు సంబంధించిన కార్ సేల్స్ డేటాను టాటా మోటార్స్ ఇటీవలే ప్రకటించింది. ఈసారి దేశీయంగా 80,383 యూనిట్లను విక్రయించింది. గతేడాది జూన్‌తో (79,606) పోల్చుకుంటే ఇది 1శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసినట్టు! మరోవైపు.. 2023 మేలో దేశీయంగా 45,197 ప్యాసింజర్ వాహనాలను విక్రయించిన సంస్థ.. జూన్‌లో 47,235 యూనిట్లను అమ్మింది. ఇది 5శాతం వృద్ధి.
ఎఫ్వై24 క్యూ1లో మంచి డిమాండ్ కనిపించినట్టు టాటా మోటార్స్ చెప్పింది. ముఖ్యంగా ఎస్యూవీ, ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌కు విశేష స్పందన లభిస్తోందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హీరో మోటోకార్ప్ కూడా..
కస్టమర్లకు మరోమారు షాక్ ఇచ్చింది దిగ్గజ 2 వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. పలు మోడల్స్ ధరలను భారీగా పెంచింది! పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఈసారి సగటున 1.5శాతం ప్రైజ్ హైక్ తీసుకున్నట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఈ ధరల పెంపు.. మోడల్, మార్కెట్ బట్టి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం