Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు- కానీ జొమాటోతో లాభాలు! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-stocks to buy today 9th september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు- కానీ జొమాటోతో లాభాలు! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Stocks to buy today : స్టాక్​ మార్కెట్​లకు భారీ నష్టాలు- కానీ జొమాటోతో లాభాలు! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Sep 09, 2024 08:09 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. జొమాటో షేర్​ ప్రైజ్​ టార్గెట్​ని నిపుణులు చెప్పారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1017 పాయింట్లు పడి 81,184 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 293 పాయింట్లు కోల్పోయి 24,852 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 896 పాయింట్లు పడి 50,577 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ ఛార్ట్​లో బలహీనత కనిపిస్తోంది.

నిఫ్టీ గత వారం ప్రతికూలంగా ముగిసింది. రోజువారీ చార్టులో, నిఫ్టీ తన 21 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (డీఈఎంఏ) కంటే దిగువన ముగిసింది. ఇది మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి సపోర్ట్​ 24,480 దగ్గర ఉంది. ఇక్కడ 50-డీఈఎంఏ ఉంది. స్వల్పకాలంలో ఏ బౌన్స్ అయినా ప్రాఫిట్​ బుకింగ్​ కనిపించొచ్చు,” అని అసిత్ సి.మెహతా ఇన్వెస్ట్​మెంట్ ఇంటర్ మీడియేట్స్ లిమిటెడ్ ఏవీపీ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హృషికేశ్ యడ్వే తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 620.95 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2121.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా నష్టపోయాయి. డౌ జోన్స్​ 1.01శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.73శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ ఏకంగా​ 2.55 శాతం పతనమైంది.

అమెరికాలో ఆగస్ట్​ నెలకు సంబంధించిన జాబ్స్​ డేట్​ అంచనాల కన్నా తక్కువగా రావడంతో మదుపర్లలో మాంద్యం భయాలు నెలకొన్నాయి. ఫలితంగా అక్కడి స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో కుప్పకూలాయి.

ఈ నెగిటివ్​ సెంటిమెంట్​ అంతర్జాతీయ మార్కెట్​లకు పాకింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అనేక ఆసియా మార్కెట్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఐనాక్స్ విండ్: రూ.225.88 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.246 | స్టాప్ లాస్: రూ.216

మ్యాక్స్ హెల్త్: రూ.898.55 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.980 | స్టాప్ లాస్: రూ.858

సోనాటా సాఫ్ట్ వేర్ లిమిటెడ్: రూ.690 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.735 | స్టాప్ లాస్: రూ.660

జొమాటో: రూ.260కే కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.285 | స్టాప్ లాస్: రూ.242

ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్: రూ.1776 వద్ద కొనుగోలు చేయవచ్చు| టార్గెట్ ధర: రూ.1840 | స్టాప్ లాస్: రూ.1740

మారికో లిమిటెడ్ (మారికో): రూ.665 వద్ద కొనండి. లక్ష్యం రూ.690. స్టాప్ లాస్ రూ.652.

టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టాటాటెక్): రూ.1,112 వద్ద కొనండి. రూ.1,150 టార్గెట్ స్టాప్ లాస్ రూ.1,090

లా ఓపలా ఆర్జీ లిమిటెడ్ (లావోపాల): రూ.340కే కొనొచ్చు. లక్ష్యం రూ.355. రూ.332 వద్ద స్టాప్ లాస్

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం