Stocks to buy : స్టాక్​ మార్కెట్​లో మాంద్యం భయాలు- కానీ ఈ రూ. 91 షేరు మీ దగ్గర ఉంటే భారీ లాభాలు!-stocks to buy today 5th august 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : స్టాక్​ మార్కెట్​లో మాంద్యం భయాలు- కానీ ఈ రూ. 91 షేరు మీ దగ్గర ఉంటే భారీ లాభాలు!

Stocks to buy : స్టాక్​ మార్కెట్​లో మాంద్యం భయాలు- కానీ ఈ రూ. 91 షేరు మీ దగ్గర ఉంటే భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2024 08:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై..
స్టాక్స్​ టు బై..

Stocks to buy today : అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 886 పాయింట్లు పడి 80,982 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 293 పాయింట్లు కోల్పోయి 24,718 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 51,350 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న వేళ నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా ఉంది. కానీ సమీప భవిష్యత్తులో అప్​ట్రెండ్​ కనిపించొచ్చు. నిఫ్టీ 24,600- 24,500 లెవల్స్​ పడితే మరింత నెగిటివ్​ ట్రెండ్​ కనిపించొచ్చు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3310 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2965.94 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 1220.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 2628.91 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 360 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Top Stocks : ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే లక్షాధికారులే.. అత్యధిక ధర కలిగిన 5 స్టాక్స్

అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు..

అంతర్జాతీయంగా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం నుంచి కుప్పకూలుతున్నాయి. ఇందుకు ఆర్థిక మాంద్యం భయాలే కారణం. ఇక ఏషియా మార్కెట్​లు సోమవారం కూడా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్​ నిక్కై ఏకంగా 5.6శాతం పడింది. సౌత్​ కొరియా కాస్పీ 4.5శాతం పడిపోయింది.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం భారీగా పడ్డాయి. డౌ జోన్స్​ 1.5శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.84శాతం, నాస్​డాక్​ ఏకంగా 2.43శాతం పతనమయ్యాయి.

ఇంటెల్​ షేర్లు 26శాతం పడిపోవడం గమనార్హం. అమెజాన్​ షేర్లు ఏకంగా 8.79శాతం కరెక్ట్​ అయ్యాయి.

స్టాక్స్​ టు బై..

హెచ్​ఎస్​సీఎల్: రూ.467.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.493, స్టాప్ లాస్ రూ.457;

సోనాకామ్స్: రూ.689.20 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.725, స్టాప్ లాస్ రూ.675; మరియు

అలెంబిక్: రూ .147 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .154, స్టాప్ లాస్ రూ .143.

బ్రేకౌట్​ స్టాక్స్​..

ఎస్​జేఎస్: రూ.984 వద్ద కొనండి, టార్గెట్ రూ.1030, స్టాప్ లాస్ రూ.945

జీహెచ్సీఎల్: రూ.630 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.660, స్టాప్ లాస్ రూ.608

ఖైతాన్ కెమికల్స్: రూ.91.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.96, స్టాప్ లాస్ రూ.88

రూబీ మిల్స్: రూబీ మిల్స్: రూ.262.40 వద్ద కొనండి, టార్గెట్ రూ.275, స్టాప్ లాస్ రూ.252

పోకర్ణ: రూ .771 వద్ద కొనండి, టార్గెట్ రూ .805, స్టాప్ లాస్ రూ .745

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం