Stocks to buy today : స్టాక్​ ఆఫ్​ ది డే.. ఈ రూ. 515 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 31st july 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్​ ఆఫ్​ ది డే.. ఈ రూ. 515 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్​ ఆఫ్​ ది డే.. ఈ రూ. 515 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 100 పాయింట్లు పెరిగి 81,455 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 21 పాయింట్లు పెరిగి 24,857 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 93 పాయింట్లు వృద్ధిచెంది 51,499 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీ50లో అప్​ట్రెండ్​ కొనసాగుతోంది.

“నిఫ్టీ 24,800 నుంచి 25,000 మధ్య కదలాడి చివరికి ఫ్లాట్​గా ముగిసింది. 24,200 నుంచి ర్యాలీ అవ్వడంతో బుల్స్​ ఊపిరిపీల్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ధోరణి సానుకూలంగా ఉంది. నిఫ్టీ నిర్ణయాత్మకంగా 24,700 దిగువకు పడిపోయే వరకు బై-ఆన్-డిప్స్ స్ట్రాటజీని అప్లై చేయవచ్చు. ఎగువన 25,000 దాటితే 25,250 వరకు నిఫ్టీ వెళ్లొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే అభిప్రాయపడ్డారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5598.64 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5565.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:- New Stock : ఈ స్టాక్ లిస్ట్ అయిన వెంటనే ఇన్వెస్టర్లకు 100 శాతం లాభం తెచ్చింది

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8870.19 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 20119.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు మిక్స్​డ్​ ముగిశాయి. డౌ జోన్స్​ 0.5శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.5శాతం పడింది. నాస్​డాక్​ 1.28శాతం మేర నష్టపోయింది.

జులై 31 సమావేశం అనంతరం వడ్డీ రేట్లపై ఫెడ్​ కీలక ప్రకటన చేయనుంది. దీనిపై స్టాక్​ మార్కెట్​ వర్గాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈసారి కాకపోయినా, సెప్టెంబర్​ నుంచి వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు నేటి సమావేశం అనంతరం ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు.

స్టాక్స్​ టు బై..

చంబల్ ఫెర్టిలైజర్స్: బై రూ.516.75 | టార్గెట్ ధర: రూ.560 | స్టాప్ లాస్: రూ.495

వోల్టాస్: బై రూ.1543.95 | టార్గెట్ ధర: రూ.1650 | స్టాప్ లాస్: రూ.1490

గుజరాత్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్: బై రూ.400 | టార్గెట్ ధర: రూ.420 | స్టాప్ లాస్: రూ.390

జిందాల్ స్టీల్ పవర్: బై రూ.979 | టార్గెట్ ధర: రూ.1010 | స్టాప్ లాస్: రూ.950

ఫినోలెక్స్ కేబుల్స్: బై రూ.1580 | టార్గెట్ ధర: రూ.1640 | స్టాప్ లాస్: రూ.1530

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం