Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 53 బ్రేకౌట్​ స్టాక్​తో భారీ లాభాలు!-stocks to buy today 30th september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 53 బ్రేకౌట్​ స్టాక్​తో భారీ లాభాలు!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 53 బ్రేకౌట్​ స్టాక్​తో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Sep 30, 2024 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​ ఇదే..
నేటి స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​ ఇదే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 264 పాయింట్లు పడి 85,572 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 37 పాయింట్లు కోల్పోయి 26,180 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 541 పాయింట్లు పతనమై 53,834 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్ అప్​ట్రెండ్ చెక్కుచెదరకుండా ఉందని, వచ్చే కొన్ని సెషన్లలో కన్సాలిడేషన్ తర్వాత నిఫ్టీ50 తిరిగి పుంజుకోవచ్చని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ షెట్టి పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే మార్కెట్ కొన్ని సెషన్ల పాటు ఒక రేంజ్ బౌండ్ యాక్షన్​లోకి మారుతుందని, ఆ తర్వాత మరోసారి బ్రేకౌట్​ను చూడొచ్చని అంచనా వేశారు. వీక్లీ చార్ట్​లో నిఫ్టీ లాంగ్ బుల్ క్యాండిల్​ను రూపొందించిందని, ఇది వరుసగా మూడొవ క్యాండిల్ అని వివరించారు.  సాంకేతికంగా ఇది అప్​ట్రెండ్​ని సూచిస్తోందని స్పష్టం చేశారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1209.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6886.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 22403.72 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 24211.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.33శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.13శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.39 పతనమైంది.

జపాన్​ స్టాక్​ మార్కెట్​ల పతనంతో ఆసియా మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్​- బై రూ .7235.75, స్టాప్​ లాస్​ రూ .6999, టార్గెట్​ రూ .7600.

బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్- బై రూ. 2858.9, స్టాప్​ లాస్​ రూ. 2750, టార్గెట్​ రూ. 3050.

పిరమల్ ఎంటర్ప్రైజెస్​- బై రూ.1095కు, స్టాప్​లాస్​ రూ.1070, టార్గెట్ రూ.1140.

మహారాష్ట్ర సీమ్​లెస్​ లిమిటెడ్​- బై రూ. 639, స్టాప్​ లాస్  రూ. 625, టార్గెట్​ రూ.  660

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సీక్వెంట్ సైంటిఫిక్: రూ.217 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.230, స్టాప్ లాస్ రూ.210;

రోలెక్స్ రింగ్స్: రూ.2650 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2800, స్టాప్ లాస్ రూ.2560;

డెంటల్ కార్ట్: రూ.636.50 వద్ద కొనండి, టార్గెట్ రూ.675, స్టాప్ లాస్ రూ.615;

శ్రీ రేణుకా షుగర్స్: రూ.53 వద్ద కొనండి, టార్గెట్ రూ.56.50, స్టాప్ లాస్ రూ.51.50; మరియు

ఎల్ఎమ్​డబ్ల్యు: రూ .17916.85 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .19,200, స్టాప్ నష్టం రూ .17,300.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం