Stocks to buy today : అప్‌ట్రెండ్‌లో స్టాక్ మార్కెట్- ఈ రూ. 105 స్టాక్‌తో భారీ లాభాలు..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1293 పాయింట్లు పెరిగి 81,333 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 429 పాయింట్లు పెరిగి 24,835 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 407 పాయింట్లు వృద్ధిచెంది 51,296 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ50 అప్‌ట్రెండ్‌లో దూసుకెళుతోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత భారత స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బాగ్డియా తెలిపారు. 50 షేర్ల ఇండెక్స్ ఇప్పుడు 25,000 మార్క్ దిశగా కదులుతోందన్నారు. అయితే, స్టాక్-నిర్దిష్ట విధానాన్ని నమ్మేవారికి, బ్రేక్అవుట్ స్టాక్స్ వైపు చూడాలని ఆయన సూచించారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2546.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2774.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 16943.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 8888.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Ola Electric IPO : ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓపై కీలక అప్డేట్- ప్రైజ్ బ్యాండ్ ఎంతంటే..
స్టాక్ టు వాచ్..
అల్ట్రాటెక్ సిమెంట్:- మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అతిపెద్ద సిమెంట్ తయారీదారు అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్‌లో 32.72 శాతం కొనుగోలుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లపై ఫోకస్ ఉండనుంది. స్టాక్ లాభపడొచ్చని అంచనాలు ఉన్నాయి.
జూలై 26 శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అల్ట్రాటెక్ సిమెం్ షేరు ధర 2.01 శాతం పెరిగి రూ.11679.25 వద్ద ముగిసింది.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 1.64శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.11శాతం పెరిగింది. నాస్డాక్ 1.03శాతం మేర వృద్ధిచెందింది.
స్టాక్స్ టు బై..
హెచ్‌సీఎల్ టెక్స్ టైల్స్: రూ.105.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.110.90, స్టాప్ లాస్ రూ.101.50;
సీఎస్ఎల్ ఫైనాన్స్: రూ.525 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.550, స్టాప్ లాస్ రూ.505
బాంకో ప్రొడక్ట్స్ ఇండియా: రూ.768 వద్ద కొనండి, టార్గెట్ రూ.805, స్టాప్ లాస్ రూ.740
ఏడబ్ల్యూహెచ్సీఎల్: రూ.890 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.935, స్టాప్ లాస్ రూ.855;
ఈఎంఎస్ లిమిటెడ్: రూ .843 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .888, స్టాప్ లాస్ రూ .815
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం