Stocks to buy today : ఐఆర్సీటీసీ, ఐటీసీ షేర్లు ఇప్పుడు కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్స్ నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : రెండు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 110 పాయింట్లు పెరిగి 64,996 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 40 పాయింట్ల లాభంతో 19,306 వద్ద స్థిరపడింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 44,494 లెవల్స్ వద్దకు చేరింది. మిడ్ క్యాప్ 0.59శాతం, స్మాల్‌క్యాప్ 0.67శాతం మేర వృద్ధిచెందాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో వీక్నెస్ కొనసాగుతోంది.
"నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది. 19,400 లెవల్స్ దిగువ ఉన్నంత కాలం ఇంతే! ఇంకా పడితే 19,100-19,000 వరకు కూడా వెళ్లొచ్చు. 19,400 వద్ద ఉన్న రెసిస్టెన్స్‌ను అధిగమిస్తే.. 19,600 వరకు వెళ్లొచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1393.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1264.01 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ సూచీలు లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Reliance AGM : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై ముకేశ్ అంబానీ కీలక అప్డేట్!
అమెరికా సూచీలు ఇలా..
అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్ 0.62శాతం, ఎస్ అండ్ పీ 500 0.63శాతం, నాస్డాక్ 0.84శాతం మేర లాభాలను నమోదు చేశాయి.
స్టాక్స్ టు బై..
ITC share price target : ఐటీసీ:- బై రూ. 441, స్టాప్ లాస్ రూ. 435, టార్గెట్ రూ. 448
టాటా కెమికల్:- బై రూ. 1038, స్టాప్ లాస్ రూ. 1020, టార్గెట్ రూ. 1055
IRCTC share price target : ఐఆర్సీటీసీ:- బై రూ. 678, స్టాప్ లాస్ రూ. 662, టార్గెట్ రూ. 711
గుజరాత్ ఆల్కలీస్:- బై రూ. 672, స్టాప్ లాస్ రూ. 653, టార్గెట్ రూ. 705
కాన్ఫిడెన్స్ పెట్రోలియం:- బై రూ. 92.40, స్టాప్ లాస్ రూ. 87, టార్గెట్ రూ. 100
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం