Stocks to buy today : ఈ రూ. 130 స్టాక్‌తో.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 353 పాయింట్లు కోల్పోయి 72,790 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 91 పాయింట్ల నష్టంతో 22,122 వద్ద ముగిసింది. ఇక 235 పాయింట్లు కోల్పోయిన బ్యాంక్ నిఫ్టీ.. 46,576 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 285.15 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అద సమయంలో డీఐఐలు రూ. 5.33 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
ఎఫ్ఐఐలు.. ఈ నెలలో కూడా సెల్లర్స్‌గానే ఉన్నారు! ఫిబ్రవరిలో ఇప్పటివరకు రూ. 16,142.44 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 20,920.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ.. దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market updates : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.16శాతం, ఎస్ అండ్ పీ 500 0.38శాతం మేర నష్టపోయాయి. నాస్డాక్ 0.02శాతం నష్టాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : టీవీఎస్ మోటార్:- బై రూ. 2162.10, స్టాప్ లాస్ రూ. 2080, టార్గెట్ రూ. 2330
హెచ్ఎఫ్సీఎల్:- బై రూ. 115.10, స్టాప్ లాస్ రూ. 111.80, టార్గెట్ రూ. 123
ఎల్ అండ్ టీఎఫ్హెచ్:- బై రూ. 171, స్టాప్ లాస్ రూ. 167, టార్గెట్ రూ. 180
సీయూబీ:- బై రూ. 135, స్టాప్ లాస్ రూ. 131, టార్గెట్ రూ. 144
హుడ్కో:- బై రూ. 203.4, స్టాప్ లాస్ రూ. 198, టార్గెట్ రూ. 218
సీడీఎస్ఎల్:- బై రూ. 1900, స్టాప్ లాస్ రూ. 1860, టార్గెట్ రూ. 1975
గుజరాత్ ఫ్లోరోకెమికల్స్:- బై రూ. 3695- రూ. 3698, స్టాప్ లాస్ రూ. 3645 , టార్గెట్ రూ. 3800
సోనాకామ్స్:- బై రూ. 662- రూ. 664, స్టాప్ లాస్ రూ. 640, టార్గెట్ రూ. 700
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం