Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 690 స్టాక్​ని ట్రాక్​ చేయండి..!-stocks to buy today 20th september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 690 స్టాక్​ని ట్రాక్​ చేయండి..!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 690 స్టాక్​ని ట్రాక్​ చేయండి..!

Sharath Chitturi HT Telugu
Sep 20, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 236 పాయింట్లు పెరిగి 83,185 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 38 పాయింట్లు పెరిగి 25,416 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 287 పాయింట్లు పెరిగి 53,038 వద్దకు చేరింది.

"నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో అప్పర్​ షాడోతో కూడిన నెగిటివ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది 25,500 రేంజ్​ వద్ద ఫాల్స్​ అప్​సైడ్​ బ్రేకౌట్​కి సంకేతం. హై నుంచి రిజెక్ట్​ అవ్వడంతో నిఫ్టీ50లో మైనర్​ డిప్స్​ వచ్చే అవకాశాలు ఉన్నాయి, " అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన రీసెర్చ్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2547.53 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2012.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 12,272.47 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,676.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 1.2శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.7శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.5 శాతం లాభపడింది.

మైక్రోసాఫ్ట్​, టెస్లా, యాపిల్​, ఎన్​వీడియా షేర్లు భారీగా వృద్ధిచెందాయి.

అమెరికా స్టాక్​ మార్కెట్​లలో భారీ ర్యాలీ నేపథ్యంలో ఆసియా మార్కెట్​లు సైతం శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:- ఈ చిన్న స్టాక్ కేవలం 5 రోజుల్లో 45 శాతం పెరిగింది.. ఇన్వెస్టర్లకు మంచి రాబడులు

స్టాక్స్​ టు బై..

ఇండియన్ హోటల్స్: రూ.691 బై. రూ.720 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.675.

సెంచురీ టెక్స్​టైల్స్: రూ.2805 బై. రూ.3100 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.2680.

డాబర్ ఇండియా: రూ.665 బై. లక్ష్యం రూ.680. రూ.654 వద్ద స్టాప్ లాస్.

కోటక్ బ్యాంక్: రూ.1,871 వద్ద కొనండి | టార్గెట్ ధర: రూ.1,940 | స్టాప్ లాస్: రూ.1,837

జుబిలెంట్ ఫుడ్: రూ.695కే కొనండి | టార్గెట్ ధర: రూ.740 | స్టాప్ లాస్: రూ.695

ఐసీఐసీఐ లాంబార్డ్: రూ.2200కే కొనండి | టార్గెట్ ధర: రూ.2360 | స్టాప్ లాస్: రూ.2120

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం