Stocks to buy today : ట్రేడర్స అలర్ట్​- ఈ 5 స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 16th september 2024 sensex and nifty news latesst ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స అలర్ట్​- ఈ 5 స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ట్రేడర్స అలర్ట్​- ఈ 5 స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Sep 16, 2024 07:31 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 72 పాయింట్లు కోల్పోయి 82,891 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 32 పాయింట్లు పడి 25,356 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 166 పాయింట్లు పెరిగి 51,938 వద్దకు చేరింది.

నిఫ్టీ స్వల్పకాలిక ధోరణి సానుకూలంగానే కొనసాగుతోందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు. 25,400 పైన స్థిరమైన కదలిక సమీపకాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్​ని 25,800కి తీసుకెళ్లదని శెట్టి అన్నారు. ఈ రోజు నిఫ్టీకి సపోర్ట్​ 25,200 వద్ద ఉందని వివరించారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2364.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2532.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 16,600.88 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,990.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- Flexi cap Mutual funds : ఇన్వెస్టర్స్​ ఫోకస్​ అంతా ‘ఫ్లెక్సీ క్యాప్​’పైనే- మీరూ ఇన్వెస్ట్​ చేయాలా?

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.72శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.54శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.65 శాతం లాభపడింది.

చైనా, సౌత్​ కొరియా, ఇండోనేషియా మార్కెట్​లకు నేడు సెలవు. జపాన్​ సూచీలు స్వల్ప నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

గుజరాత్ ఫ్లోరోకెమికల్స్:- బై రూ. 4389.6, స్టాప్​ లాస్​ రూ. 4222, టార్గెట్​ రూ. 4646

సెంచురీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్:- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 2790, టార్గెట్​ రూ. 3155

మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ఛ- బై సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 390, టార్గెట్​ రూ. 425

శక్తి షుగర్:- బై రూ. సీఎంపీ, స్టాప్​ లాస్​ రూ. 35, టార్గెట్​ రూ. 42

అమీ ఆర్గానిక్స్:- బై రూ. 1510, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1560.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం