Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈరోజు ఈ 3 స్టాక్స్​పై ఫోకస్​ చేయండి..-stocks to buy today 13th september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈరోజు ఈ 3 స్టాక్స్​పై ఫోకస్​ చేయండి..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈరోజు ఈ 3 స్టాక్స్​పై ఫోకస్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Sep 13, 2024 10:52 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1440 పాయింట్లు పెరిగి 82,963 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 470 పాయింట్లు వృద్ధి చెంది 25,389 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,772 వద్దకు చేరింది.

సెప్టెంబర్ 12న నిఫ్టీ50 కీలక రెసిస్టెన్స్​ని అధిగమించింది.

“నిఫ్టీ 50 రోజువారీ చార్టులో ఇటీవల కన్సాలిడేషన్ నుంచి బయటపడింది. ఇది మంచి విషయం. ఇది పెరుగుదలను సూచిస్తుంది. అదనంగా, ఇండెక్స్ క్లిష్టమైన 21 డే ఈఎంఐ (ఎక్స్​పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్) కంటే ఎక్కువగా కొనసాగుతోంది. రోజువారీ చార్టులో ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాస్ఓవర్​ని చూపిస్తుంది. ఇది సానుకూల సెంటిమెంటని బలపరుస్తుంది. ఇండెక్స్ ఇటీవలి కన్సాలిడేషన్ గరిష్టానికి పైన ముగియడంతో ట్రెండ్ బలంగా ఉంటుంది,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7695 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1800.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 14236.06 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5458 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్పంగా లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.58శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.75శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.98 శాతం లాభపడింది.

స్టాక్స్​ టు బై..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్): రూ.130కే కొనొచ్చు. రూ.138 టార్గెట్.. రూ.127 వద్ద స్టాప్ లాస్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ): రూ.173 వద్ద కొనండి. రూ.180 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.169

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( కాంకోర్): రూ .948 వద్ద కొనండి; రూ.1,000 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.933.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం