Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 88 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!-stocks to buy today 10 september 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 88 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​- ఈ రూ. 88 స్టాక్​తో షార్ట్​ టర్మ్​ ప్రాఫిట్స్​!

Sharath Chitturi HT Telugu
Sep 10, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 376 పాయింట్లు పెరిగి 81,560 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 84 పాయింట్లు వృద్ధి చెంది 24,936 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 541 పాయింట్లు పెరిగి 51,118 వద్దకు చేరింది.

50 ఇండెక్స్ కీలకమైన 24,900 మార్క్ పైన ముగిసిన తర్వాత భారత స్టాక్ మార్కెట్​లో ఇంకా బలం ఉందని నిరూపితమైందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అభిప్రాయపడ్డారు. దలాల్ స్ట్రీట్​లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో24,750 నుంచి 24,800 జోన్ కీలక సపోర్ట్​గా చెప్పారు. స్టాక్ స్పెసిఫిక్ విధానాన్ని పాటించాలని, బ్రేకౌట్ స్టాక్స్​ని చూడటం ట్రేడర్లకు తగిన ఇంట్రాడే ట్రేడింగ్​ టిప్​ అని ఆయన పేర్కొన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1176.55 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1757.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 2577.83 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7303.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల లాభాల్లో ఉండటం ఇందుకు కారణం.

ఇదీ చూడండి:- ఒక్క నెలలో 65 శాతం పెరుగుదల.. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన స్టాక్.. నిపుణుల అంచనా ఏంటంటే

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీగా పెరిగాయి. డౌ జోన్స్​ 1.2శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.16శాతం వృద్ధి చెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.16 శాతం లాభపడింది.

అమెరికా మార్కెట్​లో నెలకొన్న సానుకూల పరిస్థితుల కారణంగా ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ (ఈప్యాక్): రూ.281 వద్ద కొనండి. రూ.300 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.270

మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్​ లిమిటెడ్ (ఎం అండ్ ఎం): రూ.324 వద్ద కొనండి. రూ.340 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.318.3

అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ (అంబుజాసీఎం): రూ.630 వద్ద కొనండి. లక్ష్యం రూ.660. స్టాప్ లాస్ రూ.615.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

షా అల్లాయ్స్: రూ.82.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.87.50, స్టాప్ లాస్ రూ.79.50

సిన్కామ్ ఫార్ములేషన్స్: రూ.26.77 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.28.50, స్టాప్ లాస్ రూ.25.85

జీపీ పెట్రోలియమ్స్​: రూ.87.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.93, స్టాప్ లాస్ రూ.84.50

ఇండో అమైన్స్: రూ.230.38 వద్ద కొనండి, టార్గెట్ రూ.245, స్టాప్ లాస్ రూ.223

టిబిజెడ్: రూ .270.35 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .285, స్టాప్ నష్టం రూ .260

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం