Stock market holidays: వచ్చే వారం స్టాక్ మార్కెట్ కు ఈ రెండు రోజులు సెలవులు; బ్యాంక్ లకు కూడా..-stock market holidays nse bse to remain closed on these two days next week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Holidays: వచ్చే వారం స్టాక్ మార్కెట్ కు ఈ రెండు రోజులు సెలవులు; బ్యాంక్ లకు కూడా..

Stock market holidays: వచ్చే వారం స్టాక్ మార్కెట్ కు ఈ రెండు రోజులు సెలవులు; బ్యాంక్ లకు కూడా..

HT Telugu Desk HT Telugu
Mar 21, 2024 12:18 PM IST

భారత్ లోని రెండు ప్రధాన స్టాక్ మార్కెట్లైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లు మార్చి నెల చివరి వారంలో రెండు రోజుల పాటు పని చేయవు. అయితే, ఆ రెండు రోజుల్లో కమోడిటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) విభాగాల్లో పాక్షిక ట్రేడింగ్ ఉంటుంది.

మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు
మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు (Reuters)

సెలవుల కారణంగా మార్చి చివరిలో భారత స్టాక్ మార్కెట్లలో (Stock market) రెండు రోజులు కార్యకలాపాలు జరగవు. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మార్చి 25న ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించవు. దీనికి కారణం హోలీ పండుగ. మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి.

ఈ విభాగాలు పని చేస్తాయి

ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) విభాగాల్లో మార్చి 25, 29 తేదీల్లో ట్రేడింగ్ (trading) ముగియనుంది. ఈ రోజుల్లో కరెన్సీ డెరివేటివ్స్ విభాగం కూడా పని చేయదు. కమోడిటీ డెరివేటివ్స్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGR) విభాగాల్లో పాక్షిక ట్రేడింగ్ సెలవులు (trading holidays) ఉంటాయి. మార్చి 25న ఉదయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ అవుతుందని, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సెగ్మెంట్లలో ట్రేడింగ్ కు అనుమతి ఉంటుందని తెలిపింది. ఈ నెల 29న కమోడిటీ, ఈజీఆర్ విభాగాలకు పూర్తి సెలవు ఉంటుంది.

10 ట్రేడింగ్ హాలీడేస్

ఏప్రిల్ నుంచి 2024 చివరి వరకు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలకు (Stock market), వారాంతపు సెలవులు కాకుండా, మొత్తం 10 ట్రేడింగ్ సెలవులు ఉంటాయి: ఏప్రిల్లో రెండు రోజులు, మే, జూన్, జూలై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఒక్కొక్క రోజు చొప్పున సెలవులు ఉన్నాయి. అలాగే, బ్యాంక్ లకు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. హోలీ మార్చి 25న సోమవారం వస్తుంది. అంతకుముందు రోజు ఆదివారం. ఆ ఆదివారం ముందు వచ్చేది నాల్గవ శనివారం. నాల్గవ శనివారం చాలా బ్యాంక్ లు పని చేయవు. అంటే, మార్చి 23 నుంచి మూడు రోజుల పాటు బ్యాంక్ ల్లో కార్యకలాపాలు జరగవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. త్రిపుర, గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మూడు రోజులు బ్యాంకులు పని చేయవు.