స్టాక్ మార్కెట్: లాభాల్లో ఈక్విటీ సూచీలు.. సెన్సెక్స్ 551 పాయింట్లు అప్-stock markets trading in profits sensex 552 points up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  స్టాక్ మార్కెట్: లాభాల్లో ఈక్విటీ సూచీలు.. సెన్సెక్స్ 551 పాయింట్లు అప్

స్టాక్ మార్కెట్: లాభాల్లో ఈక్విటీ సూచీలు.. సెన్సెక్స్ 551 పాయింట్లు అప్

HT Telugu Desk HT Telugu
Jun 03, 2022 09:21 AM IST

భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం శుభారంభం చేశాయి. ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

<p>లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు</p>
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు (REUTERS)

స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 551 పాయింట్లు పెరిగి 56,369 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 16,772 పాయింట్లు వద్ద ట్రేడవుతోంది. 

టాప్ గెయినర్స్ జాబితాలో  హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, విప్రో, టెక్ మహీంద్రా, హిందాల్కో, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ తదితర స్టాక్స్ నిలిచాయి.

టాప్ లూజర్స్ జాబితాలో శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బ్రిటానియా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, గ్రాసిం తదితర స్టాక్స్ నిలిచాయి. 

గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. అంతకుముందు రెండు రోజుల నష్టానికి చెక్ పెడుతూ సెన్సెక్స్ 437 పాయింట్లు పెరిగి 55,818 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 105.25 పాయింట్లు పెరిగి 16,628 వద్ద ముగిసింది. 

జూన్ 8న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరింగ్ పాలసీ కమిటీ సమావేశం కానుంది. వడ్డీ రేట్లు మరింత పెంచుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. 

 

 

Whats_app_banner

టాపిక్