Stock market holiday today : దేశీయ స్టాక్ మార్కెట్లకు మంగళవారం సెలవు. దీపావళి బలిప్రాతిపద కారణంగా.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు మంగళవారం మూతపడి ఉంటాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ల కార్యకలాపాలు నేడు నిలిచిపోనున్నాయి. కరెన్సీ డెరివేటివ్ మార్కెట్ కూడా పనిచేయదు.
ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లోని కమోడిటీ సెగ్మెంట్.. తొలి భాగం మూతపడి ఉంటుంది. సాయంత్రం సెషన్ యథాతథంగా సాగుతుంది. ఈవినింగ్ సెషన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి. ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ట్రేడింగ్ జరగదు.
మంగళవారం సెలవు తర్వాత దేశీయ సూచీలు.. తిరిగి బుధవారం యథాతథంగా పనిచేస్తాయి. అన్ని సెగ్మెంట్స్‌లో కార్యకలాపాలు సాధారణంగా జరుగుతాయి.
Stock market holiday : దీపావళి నుంచి నాలుగో రోజున దీపావళి బలిప్రాతిపద జరుపుకుంటారు. దీనిని బలి పాడ్యమి అని కూడా అంటారు. కార్తిక మాసం తొలి రోజు ఇది. వామన అవతారంలో వచ్చిన విష్ణు మూర్తి.. బలి చక్రవర్తిపై విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి బలిప్రాతిపద జరుపుకుంటారు.
ఈ నెలలో.. స్టాక్ మార్కెట్లకు ఇదే తొలి సెలవు. నవంబర్ 27న, గురునానక్ జయంతి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.ఇక వచ్చే నెలలో క్రిస్మస్ రోజున, అంటే డిసెంబర్ 25న మార్కెట్లు మూతపడి ఉంటాయి.
India stock market news : ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ విషయానికొస్తే.. దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 326 పాయింట్లు కోల్పోయి 64,934 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 82 పాయింట్ల నష్టంతో 19,444 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.
ఇక ఆదివారం జరిగిన ముహురత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. ఏకంగా 100 పాయింట్లు పెరిగి 19,526 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 355 పాయింట్లు వృద్ధి చెంది 65,259 వద్దకు చేరింది.
సంబంధిత కథనం