Stock market news today, 31st Oct 2022: స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 511 పాయింట్లు పెరిగి 60,471 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 17,938 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్ తదితర స్టాక్స్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ 2.96 శాతం, టెక్ మహీంద్రా 2.09 శాతం, ఇన్ఫోసిస్ 1.94 శాతం, హిందుస్తాన్ యూనిలివర్ 1.58 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, నెస్లే, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగి 60,247 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 123.40 పాయింట్లు పెరిగి 17,910.20 పాయింట్ల వద్ద స్థిరపడింది.
శుక్రవారం సెన్సెక్స్ 203 పాయింట్ల లాభంతో 59,959.85 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల లాభంతో 17,786.80 వద్ద ముగిశాయి. గత 10 సెషన్లలో తొమ్మిది సెషన్లు ట్రేడర్లు, మదుపరులకు లాభాలు తెచ్చిపెట్టాయి. శుక్రవారం రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా లాభపడ్డాయి. మెటల్ ఇండెక్స్ 1.4 శాతం క్షీణించగా, ఐటీ ఇండెక్స్ 0.7 శాతం క్షీణించింది. నిఫ్టీ50లో రిలయన్స్, అపోలో హాస్పిటల్, ఎన్‌టిపిసి, హీరో మోటోకార్ప్ వరుసగా 3 శాతం, 2.96 శాతం, 2.08 శాతం, 1.55 శాతం లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టాటా స్టీల్, సన్ ఫార్మా, గ్రాసిమ్ నష్టపోయాయి.
విదేశీ మార్కెట్లలో బలమైన డాలర్ ప్రభావం కారణంగా శుక్రవారం రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 82.47 వద్ద ముగిసింది. అయితే దేశీయ ఈక్విటీల్లో సానుకూల ధోరణి, తాజా విదేశీ నిధుల ప్రవాహం రూపాయి నష్టాన్ని తగ్గించాయని ట్రేడర్లు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో స్థానిక కరెన్సీ రూపాయి 82.39 వద్ద బలహీనంగా ప్రారంభమై చివరకు అమెరికా కరెన్సీతో పోలిస్తే 82.47 వద్ద స్థిరపడింది.