Samsung Galaxy F14 5G: 6000mAh బ్యాటరీతో సామ్‍సంగ్ నయా 5జీ ఫోన్ వచ్చేస్తోంది: లాంచ్ డేట్ సహా మరిన్ని వివరాలివే-samsung galaxy f14 5g india launch date set for march 24 check full details
Telugu News  /  Business  /  Samsung Galaxy F14 5g India Launch Date Set For March 24 Check Full Details
Samsung Galaxy F14 5G: 6000mAh బ్యాటరీతో బడ్జెట్ రేంజ్‍లో సామ్‍సంగ్ నయా 5జీ ఫోన్ (Photo: Samsung)
Samsung Galaxy F14 5G: 6000mAh బ్యాటరీతో బడ్జెట్ రేంజ్‍లో సామ్‍సంగ్ నయా 5జీ ఫోన్ (Photo: Samsung)

Samsung Galaxy F14 5G: 6000mAh బ్యాటరీతో సామ్‍సంగ్ నయా 5జీ ఫోన్ వచ్చేస్తోంది: లాంచ్ డేట్ సహా మరిన్ని వివరాలివే

19 March 2023, 16:21 ISTChatakonda Krishna Prakash
19 March 2023, 16:21 IST

Samsung Galaxy F14 5G India launch date: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ లాంచ్ డేట్ ఖరారైంది. 6,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది.

Samsung Galaxy F14 5G India launch date: ఎఫ్ సిరీస్‍లో కొత్త 5జీ ఫోన్‍ను తీసుకొచ్చేందుకు పాపులర్ బ్రాండ్ సామ్‍సంగ్ (Samsung) రెడీ అయింది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ(Samsung Galaxy F14 5G)ని విడుదల చేయనుంది. ఈనెల 24వ తేదీన ఇండియాలో గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ లాంచ్ కానుంది. 6,000mAh బ్యాటరీ, 13 5జీ బ్యాండ్ల సపోర్ట్ ఈ ఫోన్‍కు హైలైట్లుగా ఉండనున్నాయి. వివరాలివే.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ లాంచ్ డేట్, టైమ్

Samsung Galaxy F14 5G India launch date, time: ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని సామ్‍సంగ్ అధికారికంగా వెల్లడించింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‍కు సంబంధించి ఓ పేజ్ కూడా క్రియేట్ అయింది. దీని ద్వారా కొన్ని కీలకమైన స్పెసిఫికేషన్లను సామ్‍సంగ్ టీజ్ చేస్తోంది.

Samsung Galaxy F14 5G India launch: 6,000mAh బ్యాటరీతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ రానుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆధారిత వన్ యూఐ 5.0 (OneUI 5.0) ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ మొబైల్ రన్ అవుతుంది. ఎగ్జినోస్ 1330 ప్రాసెసర్‌ ఈ స్మార్ట్ ఫోన్‍లో ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్‍ను ఉపయోగించుకొని వర్చువల్‍గా ర్యామ్‍ను పొడిగించుకునేలా ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‍లో ఇస్తోంది సామ్‍సంగ్.

6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో Samsung Galaxy F13 5G రానుందని తెలుస్తోంది. ఈ డిస్‍ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍తో వస్తుంది. 13 5జీ బ్యాండ్ల సపోర్టుతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ మొబైల్ రానుంది.

Samsung Galaxy F14 5G Price Expected: సామ్‍సంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.15వేలలోపే ఉంటుందని అంచనాలు ఉన్నాయి. గ్రీన్, పర్పుల్, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో రావొచ్చు. ఈనెల 24వ తేదీన లాంచ్ సమయంలో అధికారిక ధరను సామ్‍సంగ్ వెల్లడించనుంది.

సంబంధిత కథనం