Samsung Galaxy A05s: మార్కెట్లోకి 12 జీబీ ర్యామ్ తో సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్.. ధర, ఫీచర్స్ ఇవే..
Samsung Galaxy A05s: గెలాక్సీ ఏ సిరీస్ లో మరో కొత్త బడ్జెట్ ఫోన్ ను సామ్సంగ్ గురువారం భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 (Samsung Galaxy A05s) ఎస్ అందుబాటు ధరలో, లేటెస్ట్ ఫీచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకోనుంది.
Samsung Galaxy A05s: కొత్త బడ్జెట్ ఏ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s)‘ ను గురువారం సామ్సంగ్ ఆవిష్కరించింది. భారీ డిస్ ప్లే, హై ఎండ్ కెమెరా, లేటెస్ట్ ఫీచర్స్ తో ఇది మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ ఫీచర్స్, భారీ డిస్ ప్లేను అందుబాటు ధరలో అందించాలన్న లక్ష్యంతో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు.
Samsung Galaxy A05s: భారీ డిస్ ప్లే
ఈ స్మార్ట్ ఫోన్ 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్‌తో 6.71-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ (FHD+) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం లైట్ గ్రీన్, లైట్ వయొలెట్, బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది. ఇందులో పవర్ ఫుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో గరిష్టంగా 12 జీబీ ర్యామ్ ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 25 W సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది.
Samsung Galaxy A05s: ధర, ఇతర వివరాలు..
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 ఎస్ (Samsung Galaxy A05s) స్మార్ట్ ఫోన్ ధరను రూ. 14999 గా సామ్సంగ్ నిర్ణయించింది. ఈ ఫోన్ అన్ని సామ్సంగ్ స్టోర్స్ లో, ఈ కామర్స్ పోర్టల్స్ లో, సామ్సంగ్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ 05 కొనుగోలుపై అదనంగా ప్రత్యేక డిస్కౌంట్లను సామ్సంగ్ అందిస్తోంది. సామ్సంగ్ ప్లాట్ ఫామ్స్ పై కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది. SBI క్రెడిట్ కార్డ్‌లను పరిమిత కాల వ్యవధిలో ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు రూ. 1000 క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
టాపిక్