Digital rupee: డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తున్న ఆర్‌బీఐ.. తొలుత ఈ వర్గాలకే..-reserve bank to roll out first pilot of digital rupee today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Digital Rupee: డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తున్న ఆర్‌బీఐ.. తొలుత ఈ వర్గాలకే..

Digital rupee: డిజిటల్ కరెన్సీని లాంచ్ చేస్తున్న ఆర్‌బీఐ.. తొలుత ఈ వర్గాలకే..

Digital rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని నేడు ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది.

In October, RBI issued a concept note on central bank digital currency (CBDC), listing the risks and benefits of introducing these currencies (Photo: Mint)

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనుంది. కొద్ద రోజుల వరకు ఇది హోల్‌సేల్ సెగ్మెంట్‌ వరకే అందుబాటులో ఉంటుంది. ఈ కరెన్సీ కార్యాచరణను సమీక్షించడానికి వీలుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుంది. నెల రోజుల తరువాత పరిమితంగా కొన్ని సమూహాలకు మాత్రమే వర్తించేలా రీటైల్ సెగ్మెంట్‌కు కూడా ఈ డిజిటల్ కరెన్సీ అమలు చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది.

హోల్‌సేల్ సెగ్మెంట్‌లో పైలట్ టెస్ట్‌లో భాగంగా ముందుగా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో సెకెండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్‌ మాత్రమే సెటిల్ చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ తదితర 9 బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటాయి.

‘డిజిటల్ రూపీ (e -W) వినియోగించడం ద్వారా ఇంటర్-బ్యాంక్ మార్కెట్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అంచనా. సెంట్రల్ బ్యాంక్ సెటిల్ చేసే నగదు విషయంలో లావాదేవీ వ్యయాలు తగ్గుతాయని అంచనా. ప్రస్తుత పైలట్ ప్రాజెక్టు ద్వారా వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో క్రాస్-బార్డర్ పేమెంట్స్, ఇతర హోల్ సేల్ ట్రాన్సాక్షన్స్‌పై కూడా ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా పరీక్షిస్తారు.

అక్టోబరులో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కాన్సెప్ట్ నోట్ విడుదల చేసింది. ఈ కరెన్సీ ప్రవేశపెట్టడం వల్ల ఎదురయ్యే రిస్కులు, ప్రయోజనాలను ఈ నోట్‌లో చర్చించింది.

సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)పై ఆర్భీఐ కాన్సెప్ట్ నోట్ విఫులంగా చర్చించింది. సీబీడీసీని డిజిటల్ రూపంలో ఉండే లీగల్ టెండర్ (కరెన్సీ)గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వచించింది. ‘ఇది సావరిన్ పేపర్ కరెన్సీకి సమానంగా ఉంటుంది. కానీ రూపం మాత్రం వేరు. దీనిని ప్రస్తుతం ఉనికిలో ఉన్న కరెన్సీతో మార్పిడి చేసుకోవచ్చు. పేమెంట్‌ మాధ్యమంగా స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో సీబీడీసీ ఒక లయబులిటీగా నమోదైనట్టు కనిపిస్తుంది..’ అని ఆర్‌బీఐ వివరించింది.

ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్టు రూపకల్పనలో నిర్ధిష్టమైన బ్యాక్‌ఎండ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్స్ అవసరమవుతాయని ఆర్‌బీఐ తెలిపింది. ‘ఈరోజు గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో సెకెండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రభుత్వ సెక్యూరిటీలను సెకెండరీ మార్కెట్లో అమ్మినప్పుడు సెటిల్మెంట్ టీ+1 (కొనుగోలు ప్లస్ ఒక రోజు) ప్రాతిపదికన లావాదేవీ పూర్తవుతుంది.

ప్రస్తుతం 9 బ్యాంకులు సీబీడీసీ రూపంలో ట్రాన్సాక్షన్ చేయడానికి ఆర్‌బీఐ వద్ద అకౌంట్లు ఓపెన్ చేశాయి. వీటి ద్వారా డబ్బు తక్షణం బదిలీ అవుతుంది.

‘ఉదాహరణకు ఒక బ్యాంకు రూ. 100 కోట్లతో పదేళ్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ను మరొక బ్యాంక్ నుంచి కొనుగోలు చేయాలనుకుందనుకోండి. అది ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కొనుగోలుదారైన బ్యాంక్‌కు సంబంధించి ఆర్‌బీఐ వద్ద ఉన్న డిజిటల్ కరెన్సీ అకౌంట్‌లో ఆమేరకు డెబిట్ అవుతుంది. అమ్మకందారు ఖాతాలో అదే రోజు క్రెడిట్ అవుతుంది. సెక్యూరిటీస్ ఆర్‌బీఐ నుంచి కొనుగోలుదారుకు బదిలీ అవుతాయి..’ అని ఒక బ్యాంకర్ వివరించారు.

సీబీడీసీ కాన్సెప్ట్‌ను 2022-23 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. క్రిప్టోకరెన్సీల వల్ల ఆర్థిక స్థిరత్వానికి ఉన్న ముప్పు కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఈ సీబీడీసీని ప్రయోగాత్మకంగా లాంచ్ చేస్తోంది.