Stock market: వారం రోజుల్లో 35 శాతం పెరిగిన ఈ పవర్ కంపెనీ షేర్లు: ర్యాలీ ఇంకా కొనసాగుతుందా?-reliance power shares rise 35 percent in eight days should you buy or sell ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market: వారం రోజుల్లో 35 శాతం పెరిగిన ఈ పవర్ కంపెనీ షేర్లు: ర్యాలీ ఇంకా కొనసాగుతుందా?

Stock market: వారం రోజుల్లో 35 శాతం పెరిగిన ఈ పవర్ కంపెనీ షేర్లు: ర్యాలీ ఇంకా కొనసాగుతుందా?

HT Telugu Desk HT Telugu
Mar 26, 2024 03:26 PM IST

Reliance Power shares: ఇటీవలి కరెక్షన్ తరువాత స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆటో, మెటల్, పవర్ షేర్లు లాభాల ర్యాలీని కొనసాగిస్తున్నాయి. రిలయన్స్ పవర్ షేరు ధర మంగళవారం ఇంట్రాడేలో రూ.27.60 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ర్యాలీ కొనసాగుతుందా?

వారం రోజులుగా అప్పర్ సర్క్యూట్ లో రిలయన్స్ పవర్ షేర్స్
వారం రోజులుగా అప్పర్ సర్క్యూట్ లో రిలయన్స్ పవర్ షేర్స్

Reliance Power share price: రిలయన్స్ పవర్ షేర్లు గత వారం రోజుల్లో 35 శాతం పైగా పెరిగాయి. అనిల్ అంబానీకి చెందిన ఈ కంపెనీ షేరు ధర గత సోమవారం (మార్చి 18) నుంచి అప్పర్ సర్క్యూట్ ను తాకుతూ వస్తోంది. గత వారం (మార్చి 19) మంగళవారం మినహా అన్ని సెషన్లలో రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి.

ఎందుకు ఈ ర్యాలీ..

మార్చి 13న రిలయన్స్ పవర్ (Reliance Power) షేరు ధ స్టాక్ మార్కెట్ (Stock market) లో రూ.20.40 వద్ద ముగియగా, మార్చి 14న బలమైన కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. వరుసగా ఎనిమిది సెషన్లలో రిలయన్స్ పవర్ షేరు ధర ఎన్ఎస్ఈ లో రూ.20.40 నుంచి రూ.27.60 స్థాయికి పెరిగింది. మంగళవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే 5 శాతం అప్పర్ సర్క్యూట్ కు రిలయన్స్ పవర్ షేర చేరుకుంది. దాంతో రిలయన్స్ పవర్ షేర్ ధర ఇంట్రాడేలో రూ.27.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

రిలయన్స్ పవర్ షేర్లు ఎందుకు పెరిగాయి?

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంకుల్లో అనిల్ అంబానీ (Anil Ambani) కి చెందిన రిలయన్స్ పవర్ (Reliance Power) కంపెనీ తన బకాయిలను సెటిల్ చేసుకుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్ల ధరలు పెరుగుతున్నాయి. కంపెనీలో కొత్త మూలధన సమీకరణకు అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఐడీబీఐ బ్యాంక్ నుంచి వర్కింగ్ క్యాపిటల్ లోన్ మాత్రమే కంపెనీ బుక్స్ లో మిగిలి ఉందని నివేదికలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిలయన్స్ పవర్ రుణ రహిత కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) నుంచి తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్ మాత్రమే రిలయన్స్ పవర్ కంపెనీ తీర్చాల్సి ఉంది.