Jio Network : దేశంలోనే నెం.1 నెట్ వర్క్ గా రిలయన్స్ జియో- 9 ఓక్లా అవార్డులు సొంతం-reliance jio reached top position in 5g upload download speed ookla announced ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jio Network : దేశంలోనే నెం.1 నెట్ వర్క్ గా రిలయన్స్ జియో- 9 ఓక్లా అవార్డులు సొంతం

Jio Network : దేశంలోనే నెం.1 నెట్ వర్క్ గా రిలయన్స్ జియో- 9 ఓక్లా అవార్డులు సొంతం

Bandaru Satyaprasad HT Telugu
Oct 24, 2023 10:11 PM IST

Jio Network : రిలయన్స్ జియో 5G నెట్ వర్క్ డేటా స్పీడ్ లో దేశంలోనే నెం.1 నెట్ వర్క్ అని ఓక్లా సంస్థ ప్రకటించింది. జియోకు ఓక్లా మొత్తం 9 అవార్డులు ప్రకటించింది.

రిలయన్స్ జియో
రిలయన్స్ జియో

Jio Network : ప్రముఖ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో(Jio) భారతదేశంలో నెం.1 నెట్‌వర్క్‌గా అవతరించిందని ఓక్లా ప్రకటించింది. 5G డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంలో ఎయిర్ టెల్ కంటే ముందుందని నెట్ వర్క్ స్పీడ్ టెస్టింగ్ సంస్థ ఓక్లా తెలిపింది. 5G నెట్‌వర్క్‌ అవార్డుతో సహా మొత్తం 9 అవార్డులను జియో గెలుచుకుంది. మొబైల్ నెట్ వర్క్ డేటా స్పీడ్ లో జియో 335.75 స్కోర్ చేయగా, భారతీ ఎయిర్‌టెల్ 179.49 స్కోర్ చేసిందని ఓక్లా ప్రతినిధులు వెల్లడించారు. Jio 5G వినియోగదారులకు 416.55 Mbps (ఎయిర్‌టెల్ 213.3Mbps) డౌన్‌లోడ్ స్పీడ్ ను అందిస్తుందన్నారు.

"5G నెట్‌వర్క్‌లకు సంబంధించిన అన్ని అవార్డులతో సహా మార్కెట్‌లోని మొబైల్ నెట్‌వర్క్‌ల కోసం మొత్తం తొమ్మిది అవార్డులను గెలుచుకున్న జియో భారతదేశంలో నెం.1 నెట్‌వర్క్‌గా అవతరించింది. " అని మంగళవారం ఓక్లా ఒక ప్రకటనలో తెలిపింది.

తొమ్మిది అవార్డులు

• ఉత్తమ మొబైల్ నెట్‌వర్క్

• వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్

• ఉత్తమ మొబైల్ కవరేజ్

• టాప్ రేటెడ్ మొబైల్ నెట్‌వర్క్

• ఉత్తమ మొబైల్ వీడియో అనుభవం

• ఉత్తమ మొబైల్ గేమింగ్ అనుభవం

• వేగవంతమైన SG మొబైల్ నెట్‌వర్క్

• ఉత్తమ 5G మొబైల్ వీడియో అనుభవం

• ఉత్తమ 5G మొబైల్ గేమింగ్ అనుభవం

“ఓక్లా Speedtest అందించే కార్యాచరణతో కస్టమర్లకు మెరుగైన సేవలందించడంలో సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాం. కస్టమర్లకు రోజు వారి డేటా స్పీడ్, వీడియో, గేమింగ్‌లో సర్వీస్ అందిస్తూ... అత్యుత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించడంలో జియో ముందుంది. ఈ అవార్డులు జియోను భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన నెట్‌వర్క్‌గా మార్చాయి. తమ వినియోగదారులకు అత్యుత్తమ నెట్‌వర్క్‌ను అందించాలనే జియో ఆశయాన్ని పునరుద్ఘాటిస్తుంది" అని ఓక్లా ప్రెసిడెంట్, సీఈవో స్టీఫెన్ బై అన్నారు.

ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తో జియో కొత్త ప్లాన్

రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ అందుబాటులోకి తెచ్చింది. ఏడాది కాలపరిమితితో అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. రూ.3,227తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా తో పాటు....అన్ లిమిటెడ్ వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్.ఎం.ఎస్ లు లభిస్తాయి. ఏడాది కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందవచ్చు. దీంతో పాటు జియో క్లౌడ్‌, జియో టీవీ, జియో సినిమా యాప్స్ కూడా వీక్షించవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ వద్దనుకుంటే సోనీలివ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. సోనీలివ్, జీ5 సబ్ స్క్రిప్షన్ కోసం రూ.3,662 తో రీఛార్జ్‌ చేయించుకోవాలి. రూ.3,226 ప్లాన్‌ అయితే సోనీలివ్‌, రూ.3,225 రీఛార్జ్ అయితే జీ5 ఓటీటీ, రూ. 3,178 ప్లాన్‌ అయితే డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చని జియో తెలిపింది.

Whats_app_banner