Reliance Foundation Skilling Academy: యువతకు నైపుణ్య శిక్షణ అందించే ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’-reliance foundation skilling academy to provide skill training to youth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Foundation Skilling Academy: యువతకు నైపుణ్య శిక్షణ అందించే ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’

Reliance Foundation Skilling Academy: యువతకు నైపుణ్య శిక్షణ అందించే ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’

Sudarshan V HT Telugu

భారత దేశంలోని యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడం కోసం రిలయన్స్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ‘రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ’ని కేంద్ర మంత్రి జయంత్ చౌధరి ప్రారంభించారు. భవిష్యత్తు ఇండస్ట్రీ అవసరాలను తీర్చే నైపుణ్యాలను ఈ అకాడమీ అందించనుంది.

రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ (REUTERS)

Reliance Foundation Skilling Academy: దేశంలో జాబ్ మార్కెట్ కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ లక్ష్యంతో 'రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ' ని ప్రారంభించింది. కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌధరి ఈ అకాడమీ ని ప్రారంభించారు.

ఫ్యూచర్ రెడీ కోర్సులు

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) తో కలిసి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన 'భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత' అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ అకాడమీని ప్రారంభించారు. ఈ జాతీయ సదస్సులో ప్రభుత్వ, రాజకీయ, కార్పొరేట్ పరిరక్షణ, పరిశ్రమ, పౌర సమాజం, విద్యా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. స్కిల్ బిల్డింగ్, ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుంది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్ కు తోడ్పాటును కూడా ఇవ్వనుంది.

ప్రధానమంత్రి విజన్‌ కు అనుగుణంగా

రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ (Reliance Foundation Skilling Academy:) ప్రారంభోత్సవం సందర్భంగా, జయంత్ చౌధరి మాట్లాడుతూ, “యువతలో జీవితకాల అధ్యయనం అనే సంస్కృతిని ప్రోత్సహించడం మా లక్ష్యం. యువతను శక్తివంతం చేయాలనే భారత ప్రధానమంత్రి విజన్‌ కు అనుగుణంగా, నేను ఈ రోజు 'రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ' ని ప్రారంభించడం సంతోషకరం. ఇది యువతకు 21వ శతాబ్దం నైపుణ్యాలను అందించడంలో ఒక అడుగు ముందుకేసిన కార్యక్రమం.” అన్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యం

రిలయన్స్ ఫౌండేషన్ CEO, శ్రీ జగన్నాథ కుమార్ మాట్లాడుతూ, “యువత ఆశయాలను నెరవేర్చడంలో సహకరించడం రిలయన్స్ ఫౌండేషన్ ప్రాథమిక లక్ష్యాల్లో భాగం. ఈ స్కిల్లింగ్ అకాడమీ యువతను భవిష్యత్ ఉద్యోగాల కోసం సిద్ధం చేయడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది” అని పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ www.rfskillingacademy.com ప్లాట్‌ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది.