Redmi A2 launch : రెడ్​మీ ఏ2 సిరీస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..-redmi a2 a2 plus could launch soon in india get bis certified check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Redmi A2 Launch : రెడ్​మీ ఏ2 సిరీస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..

Redmi A2 launch : రెడ్​మీ ఏ2 సిరీస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 29, 2023 07:33 AM IST

Redmi A2 series launch in India : రెడ్​మీ నోట్​ ఏ2 సిరీస్​ త్వరలోనే ఇండియాలో లాంచ్​కానుంది! ఇందులో రెడ్​మీ ఏ2, ఏ2+ స్మార్ట్​ఫోన్స్​ ఉండనున్నాయి.

రెడ్​మీ ఏ2 సిరీస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే..
రెడ్​మీ ఏ2 సిరీస్​.. ఇండియాలో లాంచ్​ ఎప్పుడంటే.. (Representative image)

Redmi A2 series launch in India : స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో షియోమీకి మంచి గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్​ నుంచి వచ్చే లేటెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​, లేటెస్ట్​ అప్డేట్స్​పై యూజర్లకు ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే.. ఈ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త లాంచ్​లు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే రెడ్​మీ ఏ1 సిరీస్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది! ఇక ఇప్పుడు.. రెడ్​మీ ఏ2 సిరీస్​ రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రెడ్​మీ ఏ2 సిరీస్​.. లాంచ్​ ఎప్పుడు?

ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో గతేడాది లాంచ్​ అయ్యింది రెడ్​మీ ఏ1 సిరీస్​. ఇందులో రెడ్​మీ ఏ1, ఏ1+ స్మార్ట్​ఫోన్స్​ ఉన్నాయి. ఈ రెడ్​మీ ఏ1+ను పోకో సీ50గా పేరు మార్చు విక్రయిస్తోంది స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ.

Redmi A2 price in India : ఇక ఇప్పుడు రెడ్​మీ ఏ2 సిరీస్​లోనూ రెండు స్మార్ట్​ఫోన్స్​ ఉంటాయని తెలుస్తోంది. అవి.. రెడ్​మీ ఏ2, రెడ్​మీ ఏ2+. ఇప్పటికే.. వీటికి బీఐఎస్​ సర్టిఫికేషన్​ కూడా లభించినట్టు తెలుస్తోంది. బీఐఎస్​ (బ్యూరో ఆఫ్​ ఇండియన్​ స్టాండర్డ్స్​) వెబ్​సైట్​లో ఈ సిరీస్​ను గుర్తించినట్టు టిప్​స్టర్​ ముకుల్​ శర్మ తెలిపాడు.

లిస్టింగ్​లో ఈ స్మార్ట్​ఫోన్స్​ ఫిచర్స్​కు సంబంధించిన వివరాలు కనిపించలేదు. కానీ.. 1,2 నెలల్లో ఈ రెడ్​మీ ఏ2 సిరీస్​ ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Redmi A2+ features : ఇండియాలోని బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​పై షియోమీ పట్టుకోల్పోతోంది! గతేడాది.. ఈ సెగ్మెంట్​లో మూడో స్థానంలో నిలిచింది. శాంసంగ్​, వివో బ్రాండ్స్​.. మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మంచి డిమాండ్​ ఉన్న సెగ్మెంట్​పై మరింత పట్టుసాధించేందుకు సంస్థ కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే.. రెడ్​మీ ఏ2 సిరీస్​ త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

రెడ్​మీ ఏ1+ ఫీచర్స్​..

రెడ్​మీ ఏ1+లో 6.52 ఇంచ్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. హెచ్​డీ+ రిసొల్యూషన్​ సైతం ఉంటుంది. మీడియాటెక్​ హీలియో ఏ22 ఎస్​ఓసీ ప్రాసెసర్​ దీని సొంతం. 3జీబీ ర్యామ్​, 32జీబీ స్టోరేజ్​ కెపాసిటీ ఇందులో ఉంది.

Redmi A1+ features : ఇక రేర్​లో 8ఎంపీ+ 2ఎంపీ కెమెరా సెన్సార్​లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000ఎఏహెచ్​ బ్యాటరీ ఉంది. ఇది 10డబ్ల్యూ ఛార్జింగ్​కి సపోర్ట్​ చేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం