Realme 13 Pro+ : అదిరిపోయేలా రియల్మీ 13 ప్రో+.. ఫీచర్స్ లీక్! పూర్తి వివరాలు ఇవే..
Realme 13 Pro+ India launch : రియల్మీ 13 ప్రో+ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Realme 13 Pro+ launch date in India : వివిధ మార్కెట్ల కోసం రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. చైనా రియల్మీ జీటీ నియో 6కు రీబ్రాండెడ్ వెర్షన్ అయిన రియల్మీ జీటీ 6 గ్లోబల్ రిలీజ్‌ని కంపెనీ ఇటీవలే ధృవీకరించింది. అదనంగా, రియల్మీ చైనా మార్కెట్ కోసం రెండు ఫోన్లపై పనిచేస్తోంది. అవి.. రియల్మీ 13 ప్రో సిరీస్, రియల్మీ జీటీ 6 స్పెషల్ ఎడిషన్. ప్రస్తుతానికైతే రియల్మీ 13 ప్రో సిరీస్‌లోని ప్రో+ స్మార్ట్‌ఫోన్‌పై విపరీతమైన బజ్ నెలకొంది. అందుకు తగ్గట్టు.. బయటకు వస్తున్న లీక్స్ సైతం.. ఈ గ్యాడ్జెట్‌పై అంచనాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రియల్మీ 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రియల్మీ 13 ప్రో+ లాంచ్ ఎప్పుడు..?
వీబో లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. రియల్మీ మిడ్ రేంజ్ నంబర్డ్ సిరీస్, జీటీ సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్స్ రావొచ్చు. ఈ మిడ్-రేంజ్ ఫోన్.. రియల్మీ 13 ప్రో + కావచ్చని ఊహాగానాలు ఉన్నాయి. ఇది కొత్త 50 మెగాపిక్సెల్ 3ఎక్స్ పెరిస్కోప్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది రియల్మీ 12 ప్రో + ట్రెండ్‌ని కొనసాగిస్తుంది.
Realme 13 Pro+ price in India : రియల్మీ జీటీ 6 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సిలికాన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ హై-డెన్సిటీ బ్యాటరీలు ఉండవచ్చు. అయితే బ్యాటరీ సామర్థ్యంపై వివరాలపై క్లారిటీ లేదు.. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ కోసం రియల్మీ స్ట్రెయిట్, క్వాసి-స్ట్రెయిట్ (మైక్రో-కర్వ్డ్) స్క్రీన్లను పరీక్షిస్తున్నట్లు సమాచారం.
రియల్మీ 13 ప్రో+ కాన్ఫిగరేషన్స్..
నివేదికల ప్రకారం.. రాబోయే రియల్మీ 13 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. రియల్మీ 13 ప్రో +.. భారతీయ వెర్షన్ ఆర్ఎంఎక్స్3921 మోడల్ నంబర్ ద్వారా గుర్తించడం జరిగింది. మోనెట్ గోల్డ్. ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
రియల్మీ 13 ప్రో+ భారతదేశంలో నాలుగు కాన్ఫిగరేషన్లలో రానుంది. అవి.. 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 512 జీబీ. ధర వివరాలు ఇంకా తెలియరాలేదు.
Realme 13 Pro+ price : ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన రియల్మీ 12 ప్రో+ లో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో కూడిన 64 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. రియల్మీ 13 ప్రో+ లో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనుంది. రియల్మీ 13 ప్రోలో పెరిస్కోప్ కెమెరా లేదా స్టాండర్డ్ టెలిఫోటో కెమెరా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన లాంచ్ డేట్‌తో పాటు ఇతర ఫీచర్స్, ధరకు సంబంధించిన వివరాలపై త్వరలోనే ఒక అప్డేట్ వెలువడే అవకాశంది. లాంచ్ తర్వాత.. ఇది ఇండియా మార్కెట్లో ఏ మేరకు ప్రదర్శన చేస్తాయో చూడాలి.
సంబంధిత కథనం