Rashi Peripherals IPO: రాశి పెరిఫెరల్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన; పెరిగిన జీఎంపీ..-rashi ipo sails smoothly on the second day of bidding issue booked 2 27 times so far ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rashi Peripherals Ipo: రాశి పెరిఫెరల్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన; పెరిగిన జీఎంపీ..

Rashi Peripherals IPO: రాశి పెరిఫెరల్స్ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన; పెరిగిన జీఎంపీ..

HT Telugu Desk HT Telugu
Feb 08, 2024 02:17 PM IST

Rashi Peripherals IPO: రాశి పెరిఫెరల్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐపీఓ ప్రారంభమైన రెండో రోజు, గురువారం రాశి ఐపీఓ సబ్ స్క్రిప్షన్ 2.27 రెట్లు జరిగింది. రాశి పెరిఫెరల్స్ ఐపీఓ మొదటి రోజు మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, రిటైల్, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇష్యూను నడిపించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (https://www.rptechindia.com/)

Rashi Peripherals IPO Subscription Status: రాశి పెరిఫెరల్స్ ఐపీఓకు రెండో రోజున కూడా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఐపీఓ ప్రారంభమైన రెండో రోజు, గురువారం రాశి పెరిఫెరల్స్ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 2.59 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) పార్ట్ 3.65 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) పార్ట్ 67 శాతం సబ్ స్క్రైబ్ అయ్యాయి.

yearly horoscope entry point

మందకోడి ప్రారంభం

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ మొదటి రోజు మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, రిటైల్, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇష్యూను నడిపించారు. రాశి పెరిఫెరల్స్ ఐపీఓ మొదటి రోజు ముగిసేసరికి పూర్తిగా బుక్ అయింది. బీఎస్ఈ డేటా ప్రకారం రాశి ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్ 1.09 రెట్లు పెరిగింది. మొదటి రోజు రాశి పెరిఫెరల్స్ ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 1.36 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ ఐఐ) పార్ట్ 1.87 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) పార్ట్ 1 శాతం సబ్ స్క్రైబ్ అయ్యాయి.

ఒక్కో లాట్ లో 48 షేర్లు

రాశి పెరిఫెరల్స్ ఐపీ ఓ (Rashi Peripherals IPO) ఫిబ్రవరి 07, బుధవారం సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమైంది. ఫిబ్రవరి 09, శుక్రవారం వరకు ఈ ఐపీఓకు బిడ్డింగ్ చేసుకోవచ్చు. రాశి ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.295 నుంచి రూ.311 మధ్య నిర్ణయించింది. రాశి పెరిఫెరల్స్ ఐపీఓ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.180 కోట్లు సేకరించింది. రాశి పెరిఫెరల్స్ ఐపీఓకు లాట్స్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఒక్కో లాట్ లో 48 ఈక్విటీ షేర్లు ఉంటాయి. రాశి పెరిఫెరల్స్ ఐపీఓ పబ్లిక్ ఇష్యూలో 50 శాతం వాటాలను క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కు, 15 శాతానికి తగ్గకుండా నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (ఎన్ ఐఐ) కేటాయించింది.

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్

రాశి పెరిఫెరల్స్ ఐపీఓలో రెండో రోజు వరకు 1,42,37,289 షేర్లకు గాను 3,21,63,840 షేర్లకు బిడ్లు వచ్చాయి. రాశి ఐపీఓ రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 1,83,69,840 షేర్లకు బిడ్లు రాగా, ఈ విభాగంలో 71,18,645 షేర్లు ఆఫర్ లో ఉన్నాయి. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగంలో 1,10,75,856 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్యూఐబీల విభాగంలో 27,18,144 బిడ్లు రాగా, ఈ సెగ్మెంట్లో 40,67,796 షేర్లు ఆఫర్లో ఉన్నాయి.

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ వివరాలు

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ విలువ రూ.600 కోట్లు. ఇందులో పూర్తిగా 1.93 కోట్ల ఈక్విటీ షేర్ తాజాగా ఇష్యూ చేస్తున్నారు. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ లేదు. ప్రి-ఐపీఓ ప్లేస్మెంట్లో ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా భార్య మాధురీ మధుసూదన్ కేలా రూ.50 కోట్లు, వోల్రాడో వెంచర్ పార్ట్నర్స్ ఫండ్-3-బీటా రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఇన్వెస్టర్లకు రూ.311 ఇష్యూ ధరతో మొత్తం 48.23 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఈ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని కంపెనీ ప్రస్తుత రుణాలలో అన్ని లేదా కొంత భాగాన్ని ముందస్తుగా చెల్లించడానికి ఉపయోగించనున్నారు. అలాగే, కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు కూడా ఈ మొత్తాన్ని వాడుతారు.

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ జీఎంపీ

రాశి పెరిఫెరల్స్ ఐపీఓ జీఎంపీ లేదా గ్రే మార్కెట్ ప్రీమియం గురువారం +85 గా ఉంది. అంటే, గ్రే మార్కెట్లో రాశి పెరిఫెరల్స్ షేరు ధర రూ.85 ప్రీమియంతో ట్రేడవుతోందని తెలుస్తోంది. గ్రే మార్కెట్లో ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, లిస్టింగ్ రోజు రాశి పెరిఫెరల్స్ షేరు లిస్టింగ్ ప్రైస్ రూ .396 గా ఉండబోతోంది. ఇది ఐపీఓ గరిష్ట ఇష్యూ ధర అయిన రూ .311 కంటే 27.33% ఎక్కువ.

Whats_app_banner