Adani Group: ఆదానీ గ్రూప్ నకు సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్; అక్రమాలపై ఆధాారాలు లేవని స్పష్టీకరణ-prima facie no manipulation by adani group sc panel on hindenburg report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Group: ఆదానీ గ్రూప్ నకు సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్; అక్రమాలపై ఆధాారాలు లేవని స్పష్టీకరణ

Adani Group: ఆదానీ గ్రూప్ నకు సుప్రీంకోర్టు కమిటీ క్లీన్ చిట్; అక్రమాలపై ఆధాారాలు లేవని స్పష్టీకరణ

HT Telugu Desk HT Telugu
May 19, 2023 03:58 PM IST

Adani Group: గ్రూప్ కంపెనీల షేర్ల విలువను అక్రమ మార్గాల ద్వారా ఆదానీ గ్రూప్ (Adani Group) పెంచుకుందని హిండన్ బర్గ్ ఇచ్చిన నివేదికలోని ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ
ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ

Adani Group: సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ శుక్రవారం గౌతమ్ ఆదానీ (Gautam Adani) కి చెందిన ఆదానీ గ్రూప్ (Adani Group) నకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ (Hindenburg) చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చింది.

Adani Group: సెబీ డేటా ఆధారంగా..

భారతీయ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (Securities Exchange Board of India SEBI) అందించిన డేటా ని సుప్రీంకోర్టు (Supreme Court) నియమించిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ క్షుణ్నంగా పరిశీలించింది. ఆదానీ గ్రూప్ (Adani Group) ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా కానీ, గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచారనడానికి కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఈ జనవరి నెలలో ఆదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ (Hindenburg) చేసిన ఆరోపణలు నిరాధారాలని తేల్చింది. అలాగే, ఆదానీ గ్రూప్ (Adani Group) షేర్ల విలువ అకస్మాత్తుగా, భారీగా పెరగడం వెనుక సెబీ (SEBI) వైఫల్యం ఏమీ లేదని వివరించింది. హిండెన్ బర్గ్ (Hindenburg) నివేదిక బహిర్గతమైన తరువాత ఆదానీ గ్రూప్ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవడంలో కూడా సెబీ (SEBI) వైఫల్యం లేదని ఆ కమిటీ తెలిపింది.

Adani Group: మీ విచారణ కొనసాగించండి..

ఆదానీ గ్రూప్ (Adani Group) పై హిండెన్ బర్గ్ (Hindenburg) చేసిన ఆరోపణలపై సెబీ (SEBI) స్వతంత్రంగా చేస్తున్న మరో విచారణను కొనసాగించాలని, ఆ విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించాలని ఈ కమిటీ సూచించింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏఎం సాప్రే నేతృత్వం వహించారు.

Whats_app_banner