సెప్టెంబర్ 21న కొత్త అవతారంలో వస్తున్న ఒప్పో పవర్ ఫుల్ ఫోన్.. నీటిలో పడిపోయినా ఆన్‌లోనే
Oppo K12x 5G Price : ఒప్పో ఇటీవల తన కె సిరీస్ కింద ఒప్పో కే12ఎక్స్ 5జీని భారతదేశంలో లాంచ్ చేసింది. అయితే కొన్ని రోజుల్లో కొత్త కలర్ వేరియంట్లో దీన్ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
ఒప్పో కే సిరీస్ లో భాగంగా కొత్త మిలిటరీ గ్రేడ్ ఫోన్ ఒప్పో కే12ఎక్స్ 5జీని కొన్ని రోజుల కిందట విడుదల చేసింది. సెప్టెంబర్ 21న సాయంత్రం 7 గంటలకు కొత్త కలర్ వేరియంట్లో దీన్ని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ కొత్త ఫెదర్ పింక్ కలర్‌లో లభిస్తుంది.
ఈ ఫోన్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఇది ఫోన్ పడిపోయినప్పుడు తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. దుమ్ము, నీటి నుంచి ఫోన్‌ను రక్షించేందుకు ఐపీ54 రేటింగ్ కూడా ఉంది. పొరపాటున మీ ఫోన్ కింద పడి వెంటనే ఫోన్ ఎత్తితే ఫోన్ డ్యామేజ్ అవ్వదు. అలాగే ఒప్పోకు చెందిన ఈ ఫోన్ సెగ్మెంట్-ఫస్ట్ స్ప్లాష్ టచ్ ఫోన్. ఒప్పో కే12 ఎక్స్ 5జీ అన్ని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో కే12ఎక్స్ 5జీ ధర
ఒప్పో కే12ఎక్స్ ఇప్పటివరకు బ్రీజ్ బ్లూ, మిడ్ నైట్ వయొలెట్ రంగుల్లో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.15,999గానూ నిర్ణయించారు. ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్ ధర భిన్నంగా ఉంటుందా లేదా అలాగే ఉంటుందా అనేది.. ఫోన్ లాంచ్ సమయంలో కచ్చితమైన సమాచారం లభిస్తుంది.
ఒప్పో కే12ఎక్స్ ఫీచర్లు
ఒప్పో కే12ఎక్స్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ప్రాసెసర్, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ పరిమాణం కేవలం 7.68 ఎంఎం కాగా, ఈ ఫోన్ ఫ్రేమ్ గ్లాసీగా ఉండే మ్యాట్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ సూపర్ వూక్ ఛార్జర్ ఉన్నాయి.