OPPO A3x Price : రూ.12,499కే ఒప్పో కొత్త ఫోన్.. కెమెరా సూపర్.. ఇదిగో ఫీచర్ల వివరాలు
OPPO A3x Price and Other Details : ఒప్పో ఏ3ఎక్స్ త్వరలో మార్కెట్లోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. ఇందులో మీరు బలమైన డిస్‌ప్లే, అద్భుతమైన ప్రాసెసర్‌తో మంచి కెమెరాను చూడవచ్చు.
ఒప్పో తన కొత్త ఫోన్ ఒప్పో కె12ఎక్స్ 5జీని జూలై 2 న భారతదేశంలో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ పేరు ఒప్పో ఏ3ఎక్స్. అయితే ఈ ఫోన్ లాంచ్ తేదీ గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇదిలా ఉండగా 91 మొబైల్స్.. ఈ ఫోన్ ధరతో పాటు దాని అన్ని స్పెసిఫికేషన్లు, చిత్రాలతో సహా సమాచారాన్ని పంచుకుంది.
ఈ ఫోన్ 4 జీబీ + 64 జీబీ, 4 జీబీ + 128 జీబీ అనే రెండు వేరియంట్లలో రానుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గానూ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,499గానూ నిర్ణయించారు. స్టార్ లైట్ వైట్, స్పార్కిల్ బ్లాక్, స్టార్రీ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
1604×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67 హెచ్‌డీ+ డిస్‌ప్లేను కంపెనీ అందించనుంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌ను సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు.
ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను కంపెనీ అందించనుంది. 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఈ ఫోన్ అందిస్తుంది. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్గా ఉంది. ఈ బ్యాటరీ 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ 10 నిమిషాల్లో 19 శాతం వరకు ఛార్జ్ అవుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో, 100 శాతం ఛార్జ్ చేయడానికి 75 నిమిషాలు పడుతుంది. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్ 14.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. హై-స్ట్రెంత్ అల్లాయ్ ఫ్రేమ్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్‌తో ఈ ఫోన్ రానుంది.