OnePlus Pad bookings : వన్​ప్లస్ ప్యాడ్​ ప్రీ బుకింగ్స్​ షురూ.. ఈ గ్యాడ్జెట్​ కొనొచ్చా?-oneplus pad pre bookings begin check tablets price pros and cons ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Pad Bookings : వన్​ప్లస్ ప్యాడ్​ ప్రీ బుకింగ్స్​ షురూ.. ఈ గ్యాడ్జెట్​ కొనొచ్చా?

OnePlus Pad bookings : వన్​ప్లస్ ప్యాడ్​ ప్రీ బుకింగ్స్​ షురూ.. ఈ గ్యాడ్జెట్​ కొనొచ్చా?

Sharath Chitturi HT Telugu
Apr 29, 2023 07:08 AM IST

OnePlus Pad bookings : వన్​ప్లస్​ ప్యాడ్​ ప్రీ బుకింగ్స్​ మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వన్​ప్లస్ నుంచి తొలి​ ప్యాడ్..​ బుకింగ్స్​ షురూ
వన్​ప్లస్ నుంచి తొలి​ ప్యాడ్..​ బుకింగ్స్​ షురూ

OnePlus Pad bookings : ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో తొలి ప్యాడ్​ను వన్​ప్లస్​ సంస్థ లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వన్​ప్లాస్​ ప్యాడ్​ ప్రీ బుకింగ్స్​ మొదలయ్యాయి. ఆసక్తి ఉన్న వారు రూ. 37,999 చెల్లించి అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఈ కామర్స్​ సైట్స్​తో పాటు సంస్థకు చెందిన అధికారిక వెబ్​సైట్​లో ఈ ట్యాబ్​ను బుక్​ చేసుకోవచ్చు.

వన్​ప్లస్​ ప్యాడ్​- స్పెసిఫికేషన్స్​..

వన్​ప్లస్​ ప్యాడ్​లో సీఎన్​సీ అల్యుమీనియం యూనిబాడీ, 2.5డీ కర్వ్​డ్​ డిస్​ప్లే, టాప్​ బేజెల్​ మౌంటెడ్​ సెల్ఫీ షూటర్​, 88శాతం స్క్రీన్​ టు బాడీ రేషియో ఉన్నాయి.

OnePlus Pad price in India : ఇక ట్యాబ్లెట్​లో 11.61 ఇంచ్​ 2.8కే (2000X2800 పిక్సెల్స్​) 10 బిట్​ ఎల్​సీడీ ప్యానెల్​ విత్​ 144 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ ఉంది. డాల్బీ విజన్​, స్టైలస్​ పెన్​, యటాచెబుల్​ కీబోర్డ్​లను కూడా సపోర్ట్​ చేస్తుంది.

వన్​ప్లస్​ ప్యాడ్- ఫీచర్స్​..

ఈ వన్​ప్లస్​ ప్యాడ్​లో 13ఎంపీ సింగిల్​ రేర్​ కెమెరా లభిస్తోంది. ఎల్​ఈడీ ఫ్లాష్​ వస్తోంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 8ఎంపీ కెమెరా ఇస్తోంది వన్​ప్లస్​. రేర్​ కెమెరా సాయంతో 30ఎఫ్​పీఎస్​తో 4కే వీడియోలు షూట్​ చేయవచ్చు.

ఇదీ చదవండి:- OnePlus Pad vs Samsung Galaxy Tab S8 : ఈ రెండు ట్యాబ్స్​లో ఏది బెస్ట్​..?

OnePlus Pad review : వనప్లస్​ ప్యాడ్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 900 ప్రాసెసర్​, 12జీబీ ఎల్​పీడీడీఆర్​5 ర్యామ్​, 256జీబీ యూఎఫ్​ఎస్​ 3.1 స్టోరేజ్​ వంటివి ఉన్నాయి. ఆండ్రాయిడ్​ 13ఓఎస్​ విత్​ ఆక్సిజెన్​ఓఎస్​ 13.1 సపోర్ట్​ దీనికి ఉంది. 9,510ఎంఏ బ్యాటరీ దీని సొంతం. 75వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తోంది. వైఫై 6ఈ, బ్లూటూత్​ 5.3, టైప్​-సీ పోర్ట్​ వంటివి కనెక్టివిటీ ఫీచర్స్​గా ఉన్నాయి.

వన్​ప్లస్​ ప్యాడ్- ధర..

వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్లెట్ ఇండియాలో రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది. 8జీబీ ర్యామ్/ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. ఇక 12జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్​ ధరను రూ.39,999గా ఉంది. హోలో గ్రీన్ కలర్ ఆప్షన్‍లో లభిస్తుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో వన్‍ప్లస్ ప్యాడ్‍ను కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ప్రముఖ బ్యాంకుల కార్డులపై 12నెలల వరకు ఫ్రీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

వన్​ప్లస్​ ప్యాడ్​ కొనొచ్చా?

OnePlus Pad specifications : రూ. 40,000 రేంజ్​లో వన్​ప్లస్​ ప్యాడ్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​ బాగానే ఉన్నట్టు టెక్​ నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ డివైజ్​లో సిమ్​ కార్డు లేకపోవడం మైనస్​ అని అంటున్నారు. కేవలం వైఫైతోనే పనిచేస్తుందని చెబుతున్నారు. ఓఎల్​ఈడీ స్క్రీన్​తో పాటు స్టైలస్​, కీబోర్డ్​ వంటివి ట్యాబ్లెట్​తో పాటు రాకపోవడం మైనస్​ అని చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం